సాక్షి, తిరుపతి: రేణిగుంటలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను నారా లోకేష్ ఉల్లంఘించారు. పార్టీ జెండాలను తొలగిస్తున్న వీఆర్వో, వీఆర్‌ఏ, డిప్యూటీ తహశీల్దార్‌పై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఐడీ కార్డులు చూపించాలంటూ అధికారులపై టీడీపీ నేతలు దాడులకు దిగారు. సీఐ ఆరోహణరావును అసభ్య పదజాలంతో లోకేష్ దూషించారు. పాదయాత్రలో బయట నుంచి వచ్చిన గూండాలతో దౌర్జన్యానికి తెర తీశారు.
కాగా, నారా లోకేశ్ బుధవారం కూడా బెదిరింపులకు దిగారు. ‘మా జోలికొస్తే వదిలిపెట్టం. వాళ్లు ఒక్క పార్టీ ఆఫీసు మీద దాడిచేస్తే మేం వంద పగలదొబ్బుతాం. దాడిచేసిన వారిని కడ్రాయర్లతో ఊరేగిస్తాం. మాపైనే అక్రమ కేసులు పెడుతారా? రేపు అధికారంలోకి వచ్చేది మేమే. పోస్టింగులు నిర్ణయించేది నేనే. గుర్తుపెట్టుకో..’ అంటూ లోకేష్ నోరు పారేసుకున్నారు.
చదవండి: ‘ఎల్లో గ్యాంగ్’ బరితెగింపు.. ఈనాడు ‘కొట్టు’కథ.. ఆపై చింతిస్తున్నామని సవరణ
Comments
Please login to add a commentAdd a comment