
సాక్షి, కాకినాడ: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కాకినాడ పర్యటనలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగింది. జిల్లాలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలు అవుతోంది.
అయితే.. బుధవారం రాత్రి జగ్గంపేట బస్టాండ్ సెంటర్‌లో చంద్రబాబు రోడ్డు షో, బహిరంగ సభ నిర్వహించారు. ఒకవైపు చంద్రబాబు ప్రసంగిస్తుండగా.. అక్కడే ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహన్ని ఆవిష్కరించి దండ వేశారు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్. దీంతో.. ఎన్నికల పరిశీలకుల ఫిర్యాదు మేరకు నవీన్ పై జగ్గంపేట పోలీస్‌స్టేషన్‌లో సెక్షన్ 188 IPC క్రింద కేసు నమోదు అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment