
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో డీఎస్సీ నియామక పరీక్ష వాయిదా పడింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేస్తూ శుక్రవారం(అక్టోబర్ 13న) నిర్ణయం తీసుకుంది విద్యాశాఖ. షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 20 నుంచి 30వ తారీఖుల మధ్య డీఎస్సీ పరీక్షలు జరగాల్సి ఉంది. తాజా వాయిదాతో పరీక్షలు తిరిగి ఎప్పుడు నిర్ణయిస్తామనేది త్వరలోనే తెలియజేస్తామని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ సర్కారు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 5 వేల 89 పోస్టులను భర్తీ చేసేందుకు గానూ.. నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.
అయితే.. ఆ డీఎస్సీ ఎగ్జామ్ నవంబర్ 20 తారీఖు నుంచి 30 వరకు నిర్వహించనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. అక్టోబర్ 21 వరకు అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment