సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 13 నుంచి విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా.. రెండ్రోజుల తర్వాత వెళ్లనున్నారు. ఈనెల 14న ఢిల్లీకి వెళ్లి 15న జరగనున్న ఏఐసీసీ కొత్త కార్యాలయం ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఆయన 13న వెళ్లాల్సిన ఆ్రస్టేలియా పర్యటనను విరమించుకున్నారు. 16న సీఎం స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లి అక్కడి స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శిస్తారు. అనంతరం వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొంటారు. 24న రాష్ట్రానికి తిరిగి చేరుకుంటారు.
నేడు కలెక్టర్లతో సీఎం సమావేశం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో కలెక్టర్లతో సమావేశం నిర్వ హించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రా రంభించనున్న రైతు భరోసా, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలతో పా టు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ఈ సమావేశంలో కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment