5,348 పోస్టుల భర్తీకి అనుమతి  | Department of Finance Permission to fill 5,348 posts Medical Sector | Sakshi
Sakshi News home page

5,348 పోస్టుల భర్తీకి అనుమతి 

Published Thu, Mar 21 2024 6:21 AM | Last Updated on Thu, Mar 21 2024 5:45 PM

Department of Finance Permission to fill 5,348 posts Medical Sector - Sakshi

వైద్య, ఆరోగ్యశాఖలో కొలువులకు ఓకే..

ఆర్థికశాఖ ఉత్తర్వులు 

అత్యధికంగా డీఎంఈ పరిధిలో 3,235 

డాక్టర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, నర్సులు తదితర పోస్టులు ఖాళీ 

ఎన్నికల తర్వాతే నోటిఫికేషన్‌!

సాక్షి, హైదరాబాద్‌: వైద్య, ఆరోగ్య శాఖలో 5,348 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతించింది. ఈ మేరకు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పోస్టులను మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్, నోటిఫికేషన్‌ త్వరలోనే విడుదల చేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నా, ఎన్నికల తర్వాతే నోటిఫికేషన్‌ ఉండొచ్చని వైద్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.

ఎన్నికల కోడ్‌ ఉన్నప్పుడు నోటిఫికేషన్‌ విడుదల చేయాలంటే ఈసీ అనుమతి తప్పనిసరి కావడంతో దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) విభాగం పరిధిలో 3,235 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ పరిధిలో 1,255, ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో 575, డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మిని్రస్టేషన్‌ పరిధిలో 11, ఆయుష్‌ విభాగంలో 26, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఐపీఎం)లో 34, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రి పరిధిలో 212 పోస్టులు భర్తీ చేస్తారు.  

వివిధ విభాగాల్లో భర్తీ చేసే పోస్టుల వివరాలు 
► ప్రజారోగ్య సంచాలకుల విభాగంలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌– 351, ల్యాబ్‌ టెక్నీషియన్‌ (గ్రేడ్‌–2)– 193, స్టాఫ్‌నర్స్‌– 31 

► డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మిని్రస్టేషన్‌ పరిధిలోజూనియర్‌ ఎనలిస్ట్‌ – 11  

► ఆయుష్‌ విభాగంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ (ఆయుర్వేద)– 6, టెక్నికల్‌ అసిస్టెంట్‌ (యునాని) – 8, లెక్చరర్‌ (ఆయుర్వేద) –1, లెక్చరర్‌ (హోమియో) –10, మెడికల్‌ ఆఫీసర్‌ (యు) లీవ్‌ రిజర్వుడు–1   

► ఐపీఎంలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌– 4, లేబరేటరీ టెక్నీషియన్‌ గ్రేడ్‌–2 లోకల్‌ క్యాడర్‌ –6, లేబరేటరీ టెక్నీషియన్‌ గ్రేడ్‌–2 స్టేట్‌ క్యాడర్‌ –1, లేబరేటరీ అటెండెంట్‌ స్టేట్‌ క్యాడర్‌– 7, వ్యాక్సినేటర్‌ –1, స్టాఫ్‌నర్స్‌–1, ఫార్మసిస్ట్‌ (గ్రేడ్‌–2) –1, జూనియర్‌ అనెలిస్ట్‌ (లోకల్‌ క్యాడర్‌)–2, జూనియర్‌ అనెలిస్ట్‌ (స్టేట్‌ క్యాడర్‌) – 11 

► డీఎంఈ పరిధిలో సీటీ స్కాన్‌ టెక్నీషియన్‌–6, డెంటల్‌ హైజినిస్ట్‌– 3, ఈసీజీ టెక్నీషియన్‌ – 4, ఈఈజీ టెక్నీషియన్‌ – 5, అనెస్థిషియా టెక్నీషియన్‌ – 93, ఆడియో విజువల్‌ టెక్నీషియన్‌ – 32, ఆడియో మెట్రీ టెక్నీషియన్‌– 18, బయో మెడికల్‌ ఇంజనీర్‌–14, బయో మెడికల్‌ టెక్నీషియన్‌– 11, డెంటల్‌ టెక్నీషియన్‌– 53, రేడియోగ్రఫీ టెక్నీషియన్‌– 19, ఆప్తోమెట్రిస్ట్‌– 20, స్టెరిలైజేషన్‌ టెక్నీషియన్‌–15, ఫిజియోథెరపిస్ట్‌–33, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు– 555, నాన్‌ మెడికల్‌ అసిస్టెంట్లు (జి)–17, రేడియోలాజికల్‌ ఫిజిక్స్‌ అండ్‌ రేడియోలాజికల్‌ ఫిజిసిస్ట్‌ లెక్చరర్‌– 5, పర్‌ఫ్యూజనిస్ట్‌–3, లైబ్రేరియన్‌–14, ఫిజికల్‌ డైరెక్టర్‌ – 5, క్లినికల్‌ సైకాలజిస్ట్‌ – 2, స్పీచ్‌ పాథాలజిస్ట్‌– 1, చైల్డ్‌ సైకాలజిస్ట్‌– 21, ఇమ్యునోలజిస్ట్‌–1, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు–80, మెడికో సోషల్‌ వర్కర్‌ (గ్రేడ్‌–2)– 95, స్టాఫ్‌నర్సులు–1,545, స్టాటిస్టిషియన్‌–20, ఫార్మసిస్ట్‌ (గ్రేడ్‌–2) – 125, ల్యాబ్‌ టెక్నీషియన్‌ (గ్రేడ్‌–2)– 420  

► తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ పరిధిలో ఫిజియోథెరపిస్ట్‌– 13, ఏఎన్‌ఎంలు– 85, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు– 617, స్టాఫ్‌నర్సులు– 332, డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు – 6, ల్యాబ్‌ టెక్నీషియన్లు– 136, ఫార్మసిస్ట్‌ (గ్రేడ్‌–2)– 66  

► ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు.. అనెస్థీషియా– 4, బయో కెమిస్ట్రీ –1, డెంటల్‌ సర్జరీ –1, ఈఎన్‌టీ– 1, గైనిక్‌ అంకాలజీ– 2, మెడికల్‌ ఆంకాలజీ (పీడియాట్రిక్‌ మెడికల్‌ ఆంకాలజీతో కలిపి)– 4, మైక్రోబయోలజీ – 1, మాలిక్యులర్‌ అంకాలజీ –1, న్యూక్లియర్‌ మెడిసిన్‌– 2, ఆప్తమాలజీ – 1, పెయిన్‌ అండ్‌ పాలియేటివ్‌ కేర్‌– 2, పాథాలజీ– 2, ప్లాస్టిక్‌ అండ్‌ రీకన్‌స్ట్రక్టివ్‌ సర్జరీ – 2, రేడియోలాజికల్‌ ఫిజిక్స్‌ – 4, రేడియాలజీ – 2, రేడియో థెరపీ – 4, సర్జికల్‌ అంకాలజీ – 6, బ్లడ్‌ బ్యాంక్‌ మెడికల్‌ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్‌–1. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (హాస్పిటల్‌ అడ్మిని్రస్టేషన్‌) – 2, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (అనెస్థీషియా)– 2,  సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (సైటో పాథాలజీ)– 2, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (పాథాలజీ) –2, లెక్చరర్‌ (న్యూక్లియర్‌ అంకాలజీ) – 1, లెక్చరర్‌ (న్యూక్లియర్‌ మెడిసిన్‌/న్యూక్లియర్‌ మెడిసిన్‌ టెక్నాలజిస్ట్‌)– 3, బయోమెడికల్‌ ఇంజనీర్‌ – 2, స్టాఫ్‌నర్స్‌–80, ల్యాబ్‌ టెక్నీషియన్లు (గ్రేడ్‌–2 – 8, మౌల్డ్‌ టెక్నీషియన్‌ – 1, న్యూక్లియర్‌ మెడిసిన్‌ టెక్నీషియన్‌ – 2, రేడియోథెరపీ టెక్నీషియన్‌ – 10, టెక్నీషియన్లు–5, టెక్నీషియన్లు (మెడికల్‌ ఇమేజింగ్‌)– 5, థియేటర్‌ అటెండెంట్లు–5, డెంటల్‌ టెక్నీషియన్‌ –1, ఈసీజీ టెక్నీషియన్‌– 2, ల్యాబ్‌ టెక్నీషియన్‌– 8, మెడికల్‌ ఫిజిసిస్ట్‌– 5, మెడికల్‌ రికార్డ్‌ అసిస్టెంట్‌– 3, రేడియోగ్రాఫర్‌ సీటీ టెక్నీషియన్‌– 2, రేడియోగ్రాఫర్‌ మమోగ్రఫీ టెక్నీషియన్‌–1, రేడియోగ్రాఫర్‌ ఎంఆర్‌ఐ టెక్నీషియన్‌– 2, రేడియోగ్రాఫర్‌ ఆర్‌టీ టెక్నీషియన్‌– 5, రేడియోగ్రాఫర్‌–6, సోషల్‌ వర్కర్‌–6.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement