సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. ఎలక్షన్ కోడ్ ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా నగదు, బంగారం, మద్యం తరలింపుపై పోలీసులు, ఎన్నికల అధికారులు నిఘా నిరంతరం కొనసాగుతోంది. తనిఖీల్లో భారీగా నగదు, మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల తనిఖీలో లెక్కపత్రం లేని సొమ్ము రూ. 100 కోట్లు దాటింది. ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుండి ఈ రోజు ఉదయం వరకు పట్టుబడ్డ వాటి విలువ రూ.130 కోట్లు.
పట్టుబడిన నగదు
అక్టోబర్ 9 నుండి నిన్నటి వరకు సీజ్ చేసిన అమౌంట్ రూ. 71,55,58,094
నిన్న ఒక్కరోజు సీజ్ చేసిన అమౌంట్ రూ.12,58,59,177
పట్టుబడిన మద్యం
నిన్న ఒక్కరోజు పట్టుబడిన మద్యం విలువ రూ.1,10,98,610 (మద్యం : 7998 లీ, 625 కిలోల నల్ల బెల్లం, 4 కిలోల అల్లం)
అక్టోబర్ 9 నుండి నిన్నటి వరకు పట్టుబడిన మద్యం విలువ రూ.7,75,79,917
(మద్యం-52091 లీటర్లు, 1280 కిలోల నల్ల బెల్లం, 530 కిలోల అల్లం)
మత్తు పదార్థాలు
నిన్న ఒక్కరోజు పట్టుబడిన పట్టుబడిన మత్తు పదార్థాలు రూ.1,60,43,125 (560 కిలోల గంజాయి)
అక్టోబర్ 9 నుండి నిన్నటి వరకు పట్టుబడిన మత్తు పదార్థాలు
రూ.4,58,04,720 (1694 కిలోల గంజాయి)
పట్టుబడిన బంగారం, వెండి, వాటితో చేసిన ఆభరణాలు, వస్తువులు
నిన్న ఒక్కరోజు పట్టుబడ్డ వాటి విలువ రూ.4,93,88,430
(8.110 కిలోల బంగారం & 29.08 కిలోల వెండి)
అక్టోబరు 9 పట్టుబడిన వాటి విలువ 40,08,44,300
(72.267 కిలోల బంగారం & 429.107 కిలోల వెండి,- 42.203 క్యారట్ల వజ్రాలు)
ఉచిత వస్తువులు
నిన్న ఒక్కరోజు పట్టుపడ్డ వాటి విలువ రూ.1,61,02,900
(3900 కిలోల బియ్యం వగైరా)
అక్టోబర్ 9 నుండి పట్టుబడ్డ వాటి విలువ రూ.6,29,04,500
( 43700 కిలోల బియ్యం, 627 చీరలు, 80 కుట్టు యంత్రాలు, 87 కుక్కర్లు వగైరా)
మొత్తం స్వాధీనాల విలువ
నిన్న ఒక్కరోజు మొత్తం స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ. 21,84,92,242
ఇప్పటివరకు మొత్తం సీజ్ చేసిన వాటి విలువ రూ. 1,30,26,91,531
చదవండి: ప్రవళిక ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్
Comments
Please login to add a commentAdd a comment