న్యూఢిల్లీ: ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేస్తూ బీజేపీ ‘మోదీకీ పరివార్’, ‘మోదీ కీ గ్యారెంటీ’ ప్రకటనలను గుప్పిస్తోందని, వీటిని వెంటనే తొలగించి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదుచేసింది.
ముకుల్ వాస్నిక్, సల్మాన్ ఖుర్షీద్‌ల కాంగ్రెస్ ప్రతినిధి బృందం గురువారం ఈసీని కలిసి ఎన్నికల కోడ్‌ను బీజేపీ ఎలా ఉల్లంఘించిందో వివరించింది. సుప్రీంకోర్టు గతంలోనే క్లీన్‌చిట్ ఇచ్చినా 2జీ స్ప్రెక్టమ్ కేసులో అభూత కల్పనలతో బీజేపీ తప్పుడు అడ్వర్‌టైజ్‌మెంట్లు ఇచ్చిందని ఈసీకి ఫిర్యాదుచేసింది.
Comments
Please login to add a commentAdd a comment