సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల సందర్భంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎలక్షన్ కోడ్ ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా నగదు, బంగారం, మద్యం తరలింపుపై పోలీసులు, ఎన్నికల అధికారులు నిఘా నిరంతరం కొనసాగుతోంది. తనిఖీల్లో భారీగా నగదు, మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు.
ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.200 కోట్లు దాటిన పట్టుబడిన మొత్తం విలువ. నిన్న ఒక్కరోజే రూ.70 కోట్లకు పైగా విలువగల సొత్తును సీజ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియో జకవ ర్గాల పరిధిలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేర కు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు. స్థానిక పోలీ సులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 373 ఫ్లయింగ్ స్క్వా డ్‌లు, 374 స్టాటిక్ సర్వైవలెన్స్ టీమ్‌లు, 95 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment