మాట్లాడుతున్న కలెక్టర్ గోపి, సీపీ సుబ్బారాయుడు
జిల్లాలో 1,338 పోలింగ్ స్టేషన్లు, ఫ్లయింగ్ స్క్వాడ్స్–14 టీంలు, స్టాటిస్టిక్ సర్వైలైన్స్–14 టీంలు,వీడియో సర్వైలైన్స్ టీంలు–09, వీడియో వీవింగ్ 05,మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిర్వహణకు 19 టీంలు
కరీంనగర్: ఎన్నికల కోడ్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం నుంచి అమలులోకి వచ్చిందని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) నిర్వహణలో భాగంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని కరీంనగర్ కలెక్టర్ బి.గోపి వెల్లడించారు. సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, డీఐజీ రమేశ్‌నాయుడు, సీపీ సుబ్బారాయుడుతో కలిసి మాట్లాడారు.
ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో 2,807 బ్యాలెట్ యూనిట్ లు, 2,222 కంట్రోల్ యూనిట్ లు, 2,187 వివి పాట్ లు సిద్ధంగా ఉంచాం. ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులను సి–విజిల్‌యాప్ ద్వారా చేయొచ్చని సూచించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిర్వహణకు సంబంధించి ఫిర్యాదులను కంట్రోల్ రూమ్‌కు 1950కు 24 గంటలపాటు ఫిర్యాదు చేయొచ్చన్నారు.
కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రచారానికి సంబంధించిన ప్రభుత్వ, రాజకీయ ప్రకటనల తొలగింపు ప్రారంభమైందని ప్రభుత్వ పరిధిలోని ఆస్తులపై 24 గంటల్లో బహిరంగ ప్రదేశాల్లో ఉన్నవాటిని 48 గంటల్లో ... ప్రైవేటు ఆస్తులపై ఉన్న యాడ్స్‌ను 72 గంటల్లో తొలగిస్తామని కలెక్టర్ తెలిపారు. నగదు రవాణాపై ఆంక్షలు ఉన్నాయని.. రూ.50 వేలకు మించి నగదు రవాణా చేయాల్సి వస్తే.. డాక్యుమెంట్లు దగ్గర ఉంచుకోవాలన్నారు.
ఐటీ, ఎక్సైజ్, ఫారెస్ట్, జీఎస్టీ, ఆర్టీవో డిపార్ట్‌మెంట్లు నిరంతరం అప్రమత్తంగా ఉంటాయని, ఒకవేళ ఎలాంటి నగదు సీజ్ చేసినా.. డీఆర్‌డీవో నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ వాటిని పరిశీలించి చర్యలు చేపడుతుందని వివరించారు. మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ–సువిధ యాప్ ద్వారా పర్మిషన్ల కోసం్ల దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
మీడియా ప్రసారాలు, వార్తా కథనాలు, పెయిడ్ ఆర్టికల్స్, సోషల్ మీడియాపై నిరంతర నిఘా ఉంఉంటుందని పేర్కొన్నారు. ఏమైనా అనుమానాస్పదంగా అనిపిస్తే.. వాటిని అభ్యర్థి ఖర్చులో జమ చేస్తామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరువ్యవహరించినా వారిపై కేసులు నమోదు చేస్తాం అని స్పష్టంచేశారు.
జిల్లాలో తనిఖీల కోసం ఐదు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు సీపీ సుబ్బారాయుడు చెప్పారు. ఇందులో మిగిలిన డిపార్ట్‌మెంట్‌లు కూడా ఉంటాయన్నారు. ఎన్నికలపై నిఘా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక టీంలతో ఎప్పటికప్పుడు సమన్వయంతో చేసుకుంటామని తెలిపారు. అక్రమ ఆయుధాలు, లైసెన్స్‌డ్ ఆయుధాలు వెంటనే సరెండర్ చేయాలని ఆయన ఆదేశించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా నిబంధనలు పకడ్బందీగా అమలు చేస్తామని సీపీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment