టోల్‌గేట్‌ వద్ద బెల్లంపల్లి ఎమ్మెల్యే హల్‌చల్‌ | Bellampalli MLA Durgam Chinnaiah Slaps Toll Plaza Worker | Sakshi
Sakshi News home page

టోల్‌గేట్‌ వద్ద బెల్లంపల్లి ఎమ్మెల్యే హల్‌చల్‌

Published Thu, Jan 5 2023 4:05 AM | Last Updated on Thu, Jan 5 2023 10:15 AM

Bellampalli MLA Durgam Chinnaiah Slaps Toll Plaza Worker - Sakshi

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారి–363పై మంచిర్యాల జిల్లా మందమర్రి శివారులోని టోల్‌ప్లాజా వద్ద బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మంగళవారం రాత్రి హల్‌చల్‌ చేశారు. చిన్నయ్య మంచిర్యాల నుంచి బెల్లంపల్లి వెళ్తుండగా టోల్‌ప్లాజా సిబ్బంది వాహ నం ఆపడంతో కారుదిగిన ఆయన ఆగ్రహంతో వా రి పై దాడికి యత్నించారు. కాగా, పక్కనున్న వారు ఆయనను సముదాయించినట్లు తెలుస్తోంది.

ఇదంతా సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ ఘటనపై ఎమ్మెల్యే చిన్నయ్యను ‘సాక్షి’సంప్రదించగా.. ప్రమా దంలో గాయపడిన తమ బంధువుల అబ్బాయిని అంబులెన్స్‌లో తరలిస్తుండగా అక్కడి సిబ్బంది టో ల్‌ వసూలు చేయడంపై మేనేజర్‌ను కలిసే ప్రయత్నం చేశానని చెప్పారు. ఎవరిపైనా తాను దాడి చేయలేదని తెలిపారు. కాగా, సోషల్‌మీడియా, టీవీ చానళ్లలో సీసీ ఫుటేజీ వీడియో ప్రసారం కావడంతో ‘రోడ్డు పనులు పూర్తి కాకుండానే టోల్‌ వసూలు చేయడంపై స్థానిక ఎమ్మెల్యేగా అక్కడి అధికారులను అడిగా’అని వివరణ ఇచ్చారు. ఎన్‌హెచ్‌ఏఐ పీడీ రవీందర్‌రావును ‘సాక్షి’సంప్రదించగా, ఘటనపై విచారణ చేపట్టామని తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement