
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని శేజల్ అనే యువతి తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనకు న్యాయం చేయాలని కొద్ది రోజుల కిత్రం తెలంగాణ భవన్ ఎదుట ఆత్మహత్యాయత్నం కూడా చేసింది. ఈ నేపథ్యంలో సదరు యువతి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాగా, శేజల్ సోమవారం మాట్లాడుతూ.. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మూడు నెలలుగా లైంగికంగా వేధిస్తున్నారు. ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలి. నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి అయినా ఎవరూ కేసు తీసుకోవడం లేదు. ఫొటోలు మార్ఫింగ్ చేసి ఎమ్మెల్యే అనుచరులు వేధింపులకు పాల్పడుతున్నారు. పనులు చేయించుకోవాలంటే అమ్మాయిలను పంపాలంటూ దుర్గం చిన్నయ్య డిమాండ్ చేసేవారు అని సంచలన కామెంట్స్ చేశారు.
ఎంతపోరాటం చేసినా న్యాయం జరగకపోవడంతోనే ఆత్మహత్యయత్నం చేశా. వాళ్లే చేస్తున్న ప్రచారం చూస్తుంటే చనిపోయాక కూడా న్యాయం జరగదని అనిపిస్తోంది. ఎమ్మెల్యే చేసిన చాటింగ్‌ను బయటపెడితే అది ఆయన నంబర్ కాదని చెప్పారు. కానీ, అదే నంబర్ వాడుతున్నారు. మా వెనుక ఏ పార్టీవాళ్లూ లేరు. మేము ఎవరినీ మోసం చేయలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: ఖమ్మంలో మెడికో ఆత్మహత్య.. కారణం అదేనా?
Comments
Please login to add a commentAdd a comment