సాక్షి, ఢిల్లీ: లైంగికంగా, మానసికంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను వేధిస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును కోరుతూ శేజల్ అనే యువతి చేస్తున్న న్యాయ పోరాటం వంద రోజులకు చేరింది. ఈ తరుణంలో హస్తినలోని బీఆర్‌ఎస్ కార్యాలయం ఎదుట ఆమె నిరసన దీక్ష చేపట్టింది.
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ బీఆర్‌ఎస్ ఆఫీస్ ఎదుట శేజల్ గురువారం దీక్ష చేపట్టంది. పార్టీ మీద.. పదవుల మీద ఉన్న వ్యామోహంతో ఆడపిల్లకి జరిగిన అన్యాయం గురించి కనీసం పట్టించుకోకుండా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నా విన్నపం. ఆడపిల్లల వైపు అసభ్యంగా చూస్తే గుడ్లు పీకుతా అన్నారు కదా. మరి మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే నన్ను లైంగికంగా , మానసికంగా వేధిస్తున్నారు. ఈ విషయంపై గత 100 రోజులుగా నేను చేస్తున్న న్యాయ పోరాటం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమునకు కనబడడం లేదా?. నా బాధ మీకు వినబడుట లేదా? అంటూ కేసీఆర్‌ను నిలదీసింది శేజల్.
రాష్ట్రంలో నాకు న్యాయం జరగడం లేదు అని నేను ఢిల్లీ వచ్చి గత 25 రోజులు గా నిరసన తెలియజేస్తున్నా. పక్కలోకి వెళ్లకపోతే వ్యాపారం చేసుకొనివ్వరు మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య!. మాకు తెలంగాణలో స్వేచ్ఛ హక్కు లేదా? మేము తెలంగాణలో వ్యాపారం చేయకూడదా? అని సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి ప్రశ్నించిందామె. అంతేకాదు.. ఆడపిల్ల అని కూడా ఆలోచించకుండా వేధించి, తప్పుడు కేసులు పెట్టించి.. రిమాండ్‌కి పంపి తన జీవితం ఎందుకు సర్వ నాశనం చేశారంటూ నిలదీశారామె.
ఇప్పటికైనా బాధ్యత తీసుకుని.. చిన్నయ్యను పార్టీ నుండి సస్పెండ్ చేసి కేసు నమోదు చేయాలని, తనకు న్యాయం చేయకపోతే గనుక ఇదే ఆఫీస్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్దంగా ఉన్నట్లు ప్రకటించిందామె.
ఇదిలా ఉంటే.. ఇవాళ కేసీఆర్ మహారాష్ట్ర నాగపూర్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోనే శేజల్ ఢిల్లీ కార్యాలయం వద్ద కళ్లకు గంతలు, మూతికి మాస్క్‌తో నిరసనకు దిగడం గమనార్హం.
ఇదీ చదవండి: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం!
Comments
Please login to add a commentAdd a comment