ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన విద్యార్థులు | Students protest at Bellampalli MLA Durgam Chinnaiah house | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన విద్యార్థులు

Published Fri, Sep 4 2015 2:24 PM | Last Updated on Sun, Sep 3 2017 8:44 AM

జూనియర్ కాలేజీ కొత్త భవనాన్ని ప్రస్తుత కాలేజీ స్థలంలోనే నిర్మించాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆదిలాబాద్: జూనియర్ కాలేజీ కొత్త భవనాన్ని ప్రస్తుత కాలేజీ స్థలంలోనే నిర్మించాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నివాసాన్ని విద్యార్థులు ముట్టడించి... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బెల్లంపల్లిలో జూనియర్ కాలేజీ కొత్త భవనానికి ప్రభుత్వం రూ. 2.5 కోట్లు మంజూరు చేసింది.

అయితే సదరు భవనాన్ని మరో చోట నిర్మించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆ విషయం తెలిసి విద్యార్థులు ప్రస్తుత కాలేజీ స్థలంలోనే నిర్మించాలని లేకుంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో విద్యార్థులు శుక్రవారం ఎమ్మెల్యే నివాసం ఎదుట ఆందోళనకు దిగారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement