సీనియర్ న్యాయవాది సౌర్‌భ్ కిర్పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను స్వలింగ సంపర్కుడు(గే) అయినందు వల్లే జడ్జిగా పదోన్నతి కల్పించడం లేదని పేర్కొన్నారు. న్యాయమూర్తల నియామక ప్రక్రియపై కేంద్రం దృష్టిసారించిన నేపథ్యంలో సీనియర్ అడ్వకేట్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.
వాస్తవానికి సౌరభ్ కిర్పాల్ 2017లోనే జడ్జి కావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఆ ప్రతిపాదనలు ఆమోదానికి నోచుకోలేదు. కేంద్రమే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే జడ్జిగా పదోన్నతి లభించకపోవడానికి తన లైంగిక ధోరణే ప్రధాన కారణమని భావిస్తున్నట్లు సౌరభ్ కిర్పాల్ పేర్కొన్నారు. ఒక గేను న్యాయమూర్తిగా నియమించేందుకు కేంద్రం సుముఖంగా లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
చదవండి: శ్రద్ధ హత్యకేసు.. అఫ్తాబ్‌కు ఐదు రోజుల కస్టడీ.. ఉరితీయాలని డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment