రాజీవ్ హంతకులకు ఉరి తప్పింది
న్యూఢిల్లీ : మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యకేసులో దోషులకు ఎట్టకేలకు సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. ఈ కేసులో ముగ్గురు దోషులకు ఉరిశిక్షను ...జీవిత ఖైదుగా మార్చుతూ సుప్రీంకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. క్షమాభిక్ష విషయంలో ప్రభుత్వ నిర్ణయం ఆలస్యమైనందున తమ ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని పెట్టుకున్న పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పి సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పు నిచ్చింది.
ఈ కేసులో మురుగన్, శంతన్, పేరారివాలన్ జైలు శిక్ష అనుభవిస్తున్నవిషయం తెలిసిందే. ఇక సుప్రీంకోర్టు తీర్పుతో హంతకుల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు రాజీవ్ హత్యకేసులో దోషులకు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ ఖైదుగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.