నళిని.. ఇప్పుడంటే సీరియల్స్ చేస్తోంది కానీ ఒకప్పుడు సినిమాల్లో ఎక్కువగా కనిపించేది. విలనిజం పండించడంలో ఈమె దిట్ట. సినిమాల్లో, సీరియల్స్‌లో అవతలివారిని ముప్పతిప్పలు పెట్టే ఈమె నిజ జీవితంలోనూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. 1987లో దర్శకనటుడు, రచయిత రామరంజన్‌ను పెళ్లాడింది. వీరికి అరుణ, అరుణ్ అని ఇద్దరు కవలలు జన్మించారు. రానురానూ సంసారంలో గొడవలు రావడంతో నళిని- రామరాజన్ 2000వ సంవత్సరంలో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.
విడాకులు.. గుక్కపెట్టి ఏడ్చిన నళిని
కోర్టులో విడాకులు మంజూరు చేయగానే నళిని గుక్కపెట్టి ఏడ్చేయగా రామరాజు అతడిని ఓదార్చాడు. అది చూసి అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారట. అలా విడిపోయినప్పటికీ ఒకరిపై మరొకరు ఆప్యాయత కురిపించుకున్నారు. తాజాగా తమ పేరెంట్స్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది వారి కూతురు అరుణ. ఆమె మాట్లాడుతూ.. 'విడాకుల తర్వాత కూడా అమ్మానాన్న ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. అందుకు ఓ ఉదాహరణ చెప్తా.. 2010లో నాన్నకు యాక్సిడెంట్ అయింది. నా సోదరుడు ఫోన్ చేసి చెప్తే ప్రాంక్ కాల్ అనుకున్నాను. కానీ ఉదయానికల్లా అది బ్రేకింగ్ న్యూస్‌లో వచ్చింది.
ఎప్పుడూ నాన్న గురించి అడిగేది!
అది చూసి అమ్మ ఎంతో ఏడ్చింది. తనకు ఏయే అలర్జీలు ఉన్నాయి, ఏంటనేది అమ్మకే తెలుసు. అప్పట్లో అమ్మ సీరియల్స్‌తో చాలా బిజీగా ఉండేది. ప్రతిరోజు మేము ఆస్పత్రికి వెళ్లి రావడం, నాన్న కోలుకుంటున్న ఫోటోలను అమ్మకు చూపించడం.. ఇదే జరిగేది. నాన్న తింటున్నాడా? లేదా? అని అడిగి తెలుసుకునేది. వారి మధ్య అంత ఆప్యాయత ఉంది. అమ్మ కొట్టినప్పుడు నాన్న పట్టించుకునేవాడు కాదు. అలాగే నాన్న కొట్టినప్పుడు అమ్మ కూడా చూసీచూడనట్లుగానే వ్యవహరించేది.
ఇద్దరూ కొట్టేవారు
కొట్టేంతవరకు వచ్చిందంటే కచ్చితంగా ఏదో ఒక కారణం ఉండే ఉంటుందని ఇద్దరూ బలంగా నమ్మేవారు. నేను కాలేజీలో ఉన్నప్పుడు కూడా నాన్న కొట్టాడు. ఎవరో బంధువులు వచ్చినప్పుడు లేచి పలకరించలేదని దండించాడు. అమ్మానాన్న విడాకులు తీసుకున్న తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ విషయం ఇంటికి వెళ్లి మా అమ్మకు చెప్తే నువ్వేదో తప్పు చేసుంటావు. అందుకే కొట్టాడని లైట్ తీసుకుంది. అలా ఇద్దరూ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. కానీ ఒంటరి తల్లిగా తను ఎన్నో సమస్యలు ఎదుర్కొంది' అని చెప్పుకొచ్చింది అరుణ.
చదవండి: అక్కడ హను-మాన్ సినిమా ప్రదర్శించడం లేదట! డిస్ట్రిబ్యూటర్ల ఆందోళన..
Comments
Please login to add a commentAdd a comment