ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (ఫైల్‌ఫోటో)
పట్నా : తన కుమారుడు తేజ్ ప్రతాప్, ఐశ్వర్యల వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఐదురోజుల పెరోల్ మంజూరైంది. పశుగ్రాస కుంభకోణం కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ తన కుమారుడి వివాహానికి హాజరయ్యేందుకు మే 9 నుంచి 13 వరకూ పెరోల్ కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. రాంచీ ఎస్‌పీ, జార్ఖండ్ అడ్వకేట్ జనరల్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడంతో లాలూకు పెరోల్ మంజూరైంది. పెరోల్‌పై నిర్ణయం తీసుకునేందుకు జైలు అధికారులు అడ్వకేట్ జనరల్ సలహాను పరిగణనలోకి తీసుకున్నారు.
లాలూకు ఇప్పటికే రాంచీకి చెందిన రిమ్స్ ఫిట్‌నెస్ ధృవీకరణ పత్రం ఇచ్చింది. బుధవారం సాయంత్రం లాలూ రాంచీ నుంచి పట్నాకు బయలుదేరి వెళతారని ఆర్జేడీ నేత భోలా యాదవ్ తెలిపారు. లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్, బీహార్ మాజీ సీఎం దుర్గా ప్రసాద్ రాయ్‌ల మనవరాలు ఐశ్వర్యాల వివాహ నిశ్చితార్థం ఏప్రిల్ 18న పట్నాలోని హోటల్ మౌర్యలో అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఐశ్వర్యా మెహందీ వేడుక మే 12న కుటంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment