
పెళ్లి చేసుకునేందుకు ఖైదీకి పెరోల్
తిరువొత్తియూరు: పుళల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి వివాహం చేసుకునేందుకుగాను 20 రోజుల పాటు పెరోల్‌పై విడుదలకు హైకోర్టు ఆదేశించింది. కోయంబత్తూరుకు చెందిన ఫాతిమా మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో తన కుమారుడు ఎస్ అహ్మద్ కోవై బాంబు పేలుడు కేసులో శిక్షకు గురై జైలులో ఉన్నాడని తెలిపారు. ఇతనికి ఈనెల ఏడో తేదీ వివాహం చేయడానికి చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
వివాహం కోసం తన కుమారుడికి 20 రోజుల పాటు పెరోల్‌పై విడుదల చేయడానికి జైలు అధికారులను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి శివజ్ఞానం విచారించారు. అహ్మద్‌కు వే సిన జైలు శిక్షను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణలో ఉన్న దృష్ట్యా, ఖైదీ వివాహం చేసుకునేందుకు 20 రోజుల వరకు విడుదల చేయడానికి ఆదేశాలు ఇచ్చారు.