![AR Sub Inspector Cheated A married Woman - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/19/LOVE.jpg.webp?itok=bcQNjq0s)
కోనేరుసెంటర్(మచిలీపట్నం): ఆర్మ్‌డ్ రిజర్వు విభాగంలో అతనో ఎస్‌ఐ. ఉద్యోగం వచ్చిన అనంతరం కాలేజీ రోజుల్లో తనతో పాటు చదువుకున్న ఓ వివాహితను ఫేస్‌బుక్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. మాయమాటలతో లొంగతీసుకున్నాడు. వివాహం చేసుకోవాలని ఆ మహిళ కోరడంతో ముఖం చాటేశాడు. మచిలీపట్నం నరసింహనగర్‌కు చెందిన విశ్వనాథపల్లి గణేష్ జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వు విభాగంలో ఎస్‌ఐ. కొంతకాలం క్రితం ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన పెనమలూరుకు చెందిన ఓ వివాహితను ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు.
అతడి మోజులో పడిన మహిళ భర్తతో గొడవ పడి విడాకులు తీసుకుంది. అనంతరం తనను వివాహం చేసుకోమని గణేష్‌ను కోరింది. అప్పటికే ఆమెపై మొహం మొత్తిన గణేష్ వివాహం చేసుకునేందుకు నిరాకరించాడు. న్యాయం కోరుతూ సోమవారం దిశ పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఎస్పీ పి.జాషువా ఆదేశాలతో రంగంలోకి దిగిన దిశ డీఎస్పీ రాజీవ్‌కుమార్.. నిందితుడిపై రేప్, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయటంతో పాటు రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment