Shocking Video: Young Man Slaps Police Inspector For Asking To Wear Mask In UP - Sakshi
Sakshi News home page

మాస్క్‌ ఎందుకు పెట్టుకోలేదురా.. చెంప చెళ్లుమనిపించాడు

Published Sat, Apr 24 2021 11:01 AM | Last Updated on Sat, Apr 24 2021 2:47 PM

Video Viral: Young Man Slapped Sub Inspector And Ran Away - Sakshi

కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ముఖానికి మాస్క్‌ పెట్టుకోవడం తప్పనిసరి అయిపోయింది. ప్రస్తుతం దేశంలో సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అసలు మాస్క్‌ లేకుండా ఇంటి నుంచి బయటకు రావడం లేదు. ఇంట్లోంచి అడుగు కిదిపితే చాలు ముఖానికి మాస్కులు వేసుకోక తప్పడం లేదు. ఓ రకంగా చెప్పాలంటే మాస్క్‌ పెట్టుకొని పెట్టుకొని ఓ రకంగా ప్రజలకు విసుగొస్తుంది. కానీ ప్రపంచాన్నే వణికిస్తున్న ఈ మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే మాస్కులు ధరించడం తప్పనిసరి. తాజాగా ఓ యువకుడు మాస్క్‌ పెట్టుకోలేదని ఆడిగినందుకు కానిస్టేబుల్‌ చెంప చెళ్లుమనిపించాడు.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో  చోటుచేసుకుంది. రాష్ట్రంలో నిత్యం 30 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండటంతో అక్కడి ప్రభుత్వం మాస్క్ పెట్టుకోకుండా బయటకు వచ్చిన వారిపై చర్యలు తీసుకుంటోంది. పోలీసులు తమ ప్రత్యేక వాహనాల్లో రౌండ్స్ కొడుతూ ఎక్కడైనా ఎవరైనా మాస్క్ పెట్టుకోకపోతే.. రఫ్పాడిస్తున్నారు. ఈ క్రమంలో ఖుషీ నగర్‌లో ఓ యవకుడు మాస్క్ లేకుండా దర్జాగా వెళ్తుంటే.. కానిస్టేబుల్ గమనించాడు. వెంటనే అతన్ని ఆపి జీపులో ఉన్న ఇన్‌స్పెక్టర్ దగ్గరకు పంపాడు. ఇన్‌స్పెక్టర్ ఆ కుర్రాడి కాలర్ పట్టుకొని... "మాస్క్ పెట్టుకోమని ఇంతలా చెబుతుంటే ఎందుకంత నిర్లక్ష్యం.. ఇంత బలుపేంటి... మాస్క్ ఎందుకు పెట్టుకోలేదు.. పెట్టుకోమని చెబుతున్నాం కదా" అంటూ ఫైర్ అయ్యి చెయ్యి చేసుకున్నాడు.

దీంతో ఆ యువకుడు పెట్టుకుంటాను సార్‌ అని అమాయకుడిలా నటిస్తుంటే.. పోనీలే అని అతనికి ఫైన్ వెయ్యకుండా వదిలాడు ఇన్‌స్పెక్టర్. అంతే ఆ క్షణంలో ఆ కుర్రాడు ఇన్‌స్పెక్టర్ చెంప చెళ్లుమనిపించాడు. షాకైన ఇన్‌స్పెక్టర్.. రేయ్ అనేసరికి. అక్కడి నుంచి పరుగందుకున్నాడు. అతన్ని పట్టుకుందామని పరుగెత్తిన కానిస్టేబుల్‌కి అతన్ని పట్టుకోవడం కుదరలేదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. మరి మీరు కూడా ఓ లుక్కేయండి..

చదవండి: ఆక్సిజన్‌ కొరత: ఢిల్లీలో మరో 20 మంది కరోనా రోగులు మృతి

ఏ మాస్క్‌ ఎలా వాడాలి? ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement