
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ స్ఫెషల్ సెల్‌కి చెందిన ఇన్‌స్పెక్టర్ ఒకరు తన కారులో శవమై కనిపించారు. ఢిల్లీలోని కేశవపురంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎవరో ఒక వ్యక్తి కారులో కదలికలు లేకుండా పడి ఉన్నారంటూ స్థానిక పోలీసు స్టేషన్‌కు ఫోన్‌కాల్ వచ్చింది. దాంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసు ఆయనని ఢిల్లీ స్ఫెషల్ సెల్ ఇన్‌స్పెక్టర్ విశాల్ కన్వాకర్(45) గా గుర్తించారు. 1998 బ్యాచ్‌కు చెందిన ఆయన ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్‌లో పనిచేస్తున్నారు. (ఆసుపత్రులకు వార్నింగ్ ఇచ్చిన కేజ్రీవాల్)
అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను పోలీసులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఈ విషయం గురించి అతని కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందిచారు. ఈ విషయంపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. పోస్ట్‌మార్టం పూర్తి అయితే కానీ పూర్తి వివరాలు తెలియమని వారు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment