చైనా పోలీసులకు బుడతడు ఝలక్ | Fearless toddler waves a metal PIPE at inspectors who try to shut down his family's illegal market stall in China | Sakshi
Sakshi News home page

చైనా పోలీసులకు బుడతడు ఝలక్

Published Fri, Apr 15 2016 2:26 PM | Last Updated on Sun, Sep 3 2017 10:00 PM

చైనా పోలీసులకు బుడతడు ఝలక్

చైనా పోలీసులకు బుడతడు ఝలక్

బీజింగ్: సాధారణంగా చిన్న పిల్లలు కొత్త వ్యక్తులను చూస్తే భయపడుతుంటారు. ప్రేమగా పిలుస్తున్నా దగ్గరకు వెళ్లే సాహసం కూడా చేయరు. అలాంటిది కోపంతో గుడ్లురుమి చూస్తే.. ఇక వారు భయపడకుండా ఉంటారా.. కానీ చైనాలో మాత్రం అలా జరగలేదు. పట్టుమని రెండేళ్లు కూడా నిండుగా ఉండని చైనా బాలుడు అలా కన్నెర్ర చేసిన పోలీసులపైకి కర్ర విసిరే పనిచేశాడు. తన తల్లిదండ్రుల షాపును బలవంతంగా మూయిండచడానికి వచ్చిన పోలీసులపైకి వెళ్లాడు.

అది కూడా ఒట్టి చేతులతో కాదు.. అక్కడే ఉన్న ఒక స్టీలు పైపులాంటి వస్తువుతో. దాన్ని చేతబూని దగ్గరకు వస్తున్న పోలీసులను అడుగెస్తే పడతాయ్ అని హెచ్చరిస్తున్నట్లు తన శక్తిమేరకు ఆ కర్రను విసురుతూ వారి ఆగిన తర్వాత దాన్ని కిందపడేశాడు. ఈ సంఘటనను దగ్గరుండి చూసిన కొందరు వ్యక్తులు ఇంటర్నెట్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో హల్ చేస్తుండగా.. బుడ్డవాడు అంత పనిచేసే వాతావరణం కల్పించిన పోలీసు అధికారులపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement