
తమిళనాడు, టీ.నగర్: అన్నానగర్‌లో మహిళా ఇన్‌స్పెక్టర్ భర్త సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నై అన్నానగర్ పోలీసు క్వార్టర్స్‌లో నివసిస్తున్న సుచిత్రాదేవి (40) ఇన్‌స్పెక్టర్. ఈమె మొదటి భర్త బాలాజి అనారోగ్యం కారణంగా 2009లో మృతి చెందారు. ఈమెకు దక్షన్ (10) అనే కుమారుడు వున్నాడు. స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు. సుచిత్రాదేవి హార్బర్‌లో మేనేజర్‌గా పని చేస్తున్న గోపీనాథ్ (35)ను 2012లో వివాహం చేసుకున్నారు. వీరికి లక్షణ (03) అనే కుమార్తె ఉంది. సోమవారం సుచిత్రాదేవి భర్తతో ఫోన్‌లో మాట్లాడారు. ఆ సమయంలో నగదు కోరినట్లు సమాచారం. దీంతో వారిద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది. ఇంటికి వచ్చిన గోపీనాథ్ పడక గదికి నిద్రించేందుకు వెళ్లాడు. సుచిత్రాదేవి తలుపులు తట్టగా తెరచుకోలేదు. తలుపులు పగులగొట్టి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న అన్నానగర్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం కీల్పాక్కం ఆసుపత్రికి పంపారు. దీనిపై మహిళా ఇన్‌స్పెక్టర్ సుచిత్రాదేవి వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment