శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులోని ఏపీ జెన్‌కో విద్యుత్ ప్రాజెక్టులో బొగ్గు కొరత వల్ల రెండో యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తి నిలిపేసినట్లు ప్రాజెక్టు ఇంజనీర్లు ఆదివారం తెలిపారు.
నెల్లూరు(ముత్తుకూరు): శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులోని ఏపీ జెన్‌కో విద్యుత్ ప్రాజెక్టులో బొగ్గు కొరత వల్ల రెండో యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తి నిలిపేసినట్లు ప్రాజెక్టు ఇంజనీర్లు ఆదివారం తెలిపారు. ఒకటో యూనిట్‌లో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని చెప్పారు.
ప్రస్తుతం ప్రాజెక్టులో 35 వేల టన్నుల మేరకే బొగ్గు నిల్వలున్నాయని తెలిపారు. రెండో యూనిట్‌కు కోల్ ఇండియా నుంచి బొగ్గు మంజూరు కాలేదని చెప్పారు. చర్చలు జరుగుతున్నాయని, పదిరోజుల్లో రెండో యూనిట్‌కు బొగ్గు మంజూరయ్యే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.