
తాళాలు తీస్తుండగా షాక్ కొట్టిన దృశ్యాలు
సాక్షి, బెంగళూరు(యశవంతపుర): విద్యుత్ తీగపై పడిన కారు తాళాన్ని తీస్తున్న వ్యక్తికి తీగలు తగలడంతో షాక్ కొట్టి ప్రాణాలు వదిలాడు. ఈ దుర్ఘటన హాసన్ పట్టణంలో బుధవారం ఉదయం జరిగింది. వివరాలు... ఉదయగిరికి చెందిన మల్లప్ప ప్రభుత్వ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పని చేస్తున్నాడు. ఆయన ఇంటి రెండో అంతస్తులో ఉంటాడు. ఏమైందో కానీ ఆయన కారు తాళాలు ఇంటి ముందు వెళ్లే కరెంట్ తీగపై పడ్డాయి.
ఇంట్లో చెత్తను ఊడ్చే ఇనుప కడ్డీతో తాళాలను తీసేందుకు యత్నించాడు. ఆ ఇనుప రాడ్ కరెంటు తీగలను తాకగానే పెద్ద మెరుపుతో కూడిన మంటలు వచ్చి షాక్ కొట్టింది. మల్లప్ప అక్కడికక్కడే మరణించాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఘటనపై బడావణె పోలీసులు కేసు నమోదు చేశారు. ఇనుప కడ్డికీ కరెంట్ తగిలితే ప్రమాదమని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించాడా? అని ప్రజలు ఆశ్చర్యపోయారు.
చదవండి: (బెంగళూరులో పెరిగిన సహజీవనం కల్చర్.. బాధితులంతా వారే)