ఈ డివైజ్‌తో అందమైన ముఖ ఆకృతి మీ సొంతం! | Facial Micro Current Face Massager Face Lift Facial Toning | Sakshi

మేకప్‌, కాస్మెటిక్స్‌తో పనిలేదు! జస్ట్‌ ఈ డివైజ్‌ ఉంటే అందమైన ముఖ ఆకృతి మీ సొందం

Dec 17 2023 5:11 PM | Updated on Dec 17 2023 5:11 PM

Facial Micro Current Face Massager Face Lift Facial Toning - Sakshi

ముఖాన్ని కాస్టీ కాస్మెటిక్స్‌తో, మేకప్‌తో తీర్చిదిద్దడం కంటే.. ఇలాంటి డివైస్‌ల సాయంతో తీర్చిదిద్దితే ఆ అందం ఎక్కువ కాలం నిలుస్తుంది. చిత్రంలోని ఈ మైక్రోకరెంట్‌ ఫేషియల్‌ మసాజర్‌ను ఉపయోగించి.. డబుల్‌ చిన్‌ను తగ్గించుకోవచ్చు. ముడతలు, గీతలు లేకుండా మృదువుగా మార్చుకోవచ్చు. ఈ స్కిన్‌ లిఫ్ట్‌ పరికరం.. హీటింగ్, వైబ్రేషన్‌తో పనిచేస్తుంది. ఇది కళ్లు, పెదవులు, బుగ్గలు ఇలా ప్రతి భాగంలోనూ ముడతలు, మచ్చలు, మొటిమలు, సన్‌స్పాట్‌లను పూర్తిగా మాయం చేస్తుంది.

అలాగే ముఖ ఆకృతిని మార్చి.. డార్క్‌ సర్కిల్స్‌ని తగ్గిస్తుంది. ప్రత్యేకమైన గ్లోను అందిస్తుంది. ఎలక్ట్రిక్‌ డివైస్‌ అయిన ఈ మసాజర్‌.. ఎలాంటి ప్రమాదాలను కలిగించదు.  స్కిన్‌ రిజువనేషన్‌ స్కిన్‌ కేర్‌ టూల్‌గా గుర్తింపు పొందిన ఈ మెషిన్‌కి చిత్రంలో చూపిన విధంగా చార్జింగ్‌ పెట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైన బేస్‌ లభిస్తుంది. దానిమీద ఈ టూల్‌ని అమర్చుకుని చార్జింగ్‌ పెట్టుకోవాలి.

ఇందులో మొత్తం నాలుగు రంగుల ప్రత్యేకమైన మోడ్స్‌ ఉంటాయి. రెడ్, పర్పుల్‌తో పాటు బ్లూ కలర్‌లో రెండు మోడ్స్‌ ఉంటాయి. ఈ డివైస్‌ని ఎలా వాడాలో తెలుపుతూ ఒక బుక్‌లెట్‌ కూడా లభిస్తుంది. దీనికి రెండు హెడ్స్‌ ఉంటాయి. ఒకటి క్లీనింగ్‌ బ్రష్‌ హెడ్, రెండు మసాజింగ్‌ హెడ్‌. వాటిని మార్చుకుంటూ చర్మాన్ని మొదట శుభ్రం చేసుకుని.. తర్వాత మసాజ్‌ చేసుకుంటే మంచి ఫలితం అందుతుంది.  

(చదవండి: 'ఇంగువ'ని ఇలా తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement