PoS machines
-
45 నిమిషాల్లోనే పీవోఎస్ ఇన్స్టాల్! యాక్సిస్ బ్యాంక్ ‘సారథి’తో..
న్యూఢిల్లీ: వ్యాపారవర్గాలకు పీవోఎస్ టెర్మినల్స్‌ను ఇన్స్టాల్ చేసే ప్రక్రియను సులభతరం, వేగవంతం చేసే దిశగా ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ ‘‘సారథి’’ పేరిట డిజిటల్ ఆన్‌బోర్డింగ్ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించింది. రియల్ టైమ్ డేటా బేస్ పరిశీలన, లైవ్ వీడియో ధృవీకరణ ద్వారా దరఖాస్తు ప్రక్రియను ఇది క్రమబద్ధీకరిస్తుందని బ్యాంక్ ప్రెసిడెంట్ సంజీవ్ మొఘె తెలిపారు. దీనితో క్షేత్ర స్థాయి వెరిఫికేషన్ ప్రక్రియతో పని లేకుండా, దరఖాస్తును ప్రాసెస్ చేసిన 45 నిమిషాల్లోనే ఇన్స్టాల్ చేసేందుకు వీలవుతుందని ఆయన వివరించారు. సాంప్రదాయ ఆన్‌బోర్డింగ్ ప్రక్రియకు రోజుల తరబడి సమయం పట్టేస్తుందని, ఈ విధానంలో పేపర్ రహితంగా కేవలం నాలుగు అంచెల్లోనే పీవోఎస్ టెర్మినల్స్ ఇన్స్టాలేషన్ పూర్తవుతుందని మొఘె చెప్పారు. ఇదీ చదవండి: SpiceJet: ఆ ఉద్యోగులకు నిజంగా పండగే! రూ.7.5 లక్షల జీతం, రూ.లక్ష రివార్డు.. బెనిఫిట్లు మామూలుగా లేవుగా.. -
ఆఫ్‌లైన్ కస్టమర్లకూ పేటీఎం ఆఫర్లు
హైదరాబాద్/న్యూఢిల్లీ: భారతదేశపు ప్రముఖ డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ పేటీఎం ఈ పండుగ సీజన్లో బంపర్ ఆఫర్లను ప్రకటించింది. తన ఆల్ ఇన్ వన్ పీఓఎస్ పరికరాల ద్వారా చిన్న దుకాణదారులకు ఈ ఆఫర్లను ప్రకటించింది. ఈఫెస్టివ్ సీజన్లో వ్యాపారులు అమ్మకాలను పెంచడానికి, ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ఇందుకోసం వివిధ బ్యాంకులు, వివిధ బ్రాండ్లతో ఒప్పందాలు చేసుకుంది. ఈమేరకు పేటీఎం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా చిల్లర వ్యాపారులు నో కాస్ట్ ఆఫర్లు, అగ్ర బ్యాంకుల నుంచి వందకు పైగా క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందిస్తున్నామని ఇందులకు,చిన్న వ్యాపారాలకు అధికారం ఇస్తున్నట్లు ప్రకటించింది. పీవోఎస్ పరికరాలతో 2 లక్షలకు పైగా ఆఫ్‌లైన్ వ్యాపారాలు ఇందులో పాల్గొంటాయని పేటీఎం ప్రకటించింది. తద్వారా ఇ-కామర్స్ సంస్థలు, పెద్ద రిటైలర్ల మాదిరిగానే ఆఫ్‌లైన్ వ్యాపారులు కూడా తమ కస్టమర్లకు కూడా నో కాస్ట్ ఈఎంఐ, క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించింది. ఇందుకోసం యాక్సిస్, సిటీబ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫ్ బరోడాతో సహా టాప్ 15 బ్యాంకులతో కంపెనీ భాగస్వామ్యం కలిగి ఉంది. అలాగే ఎల్జీ, ఒప్పో, వివో, రియల్‌మి, ఆసుస్, హైయర్,వోల్టాస్, వోల్టాస్ బెకో,డైకిన్,బాష్, సిమెన్స్ వంటి ప్రధాన బ్రాండ్లతోడీల్ కుదర్చుకుంది. నిబంధనల ప్రకారం వినియోగదారులకు రూ .20,000 వరకు తగ్గింపును అందించనున్నాయి. స్మార్ట్ పీఓఎస్ డివైస్ల ద్వారా క్రెడిట్, డెబిట్ కార్డ్ స్వైపింగ్, క్యూఆర్ కోడ్ లాంటి అన్ని చెల్లింపులను అంగీకరించి, వారి కార్యకలాపాలను సమర్ధవంతంగా నడిపించి వారిని శక్తివంతం చేయనున్నాని పేటీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రేణు సత్తి వెల్లడించారు. ముఖ్యంగా టైర్ -2, టైర్ -3, మిగిలిన భారత నగరాలలో ఆఫ్‌లైన్ వ్యాపారులు, చిన్న దుకాణదారులతో విస్తృతంగా పనిచేస్తున్నట్లు పేటీఎం తెలిపింది. అలాగే మిలియన్ల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.అలాగే డిజిటల్ ఇండియా మిషన్కి అవసరమైన డిజిటలైజేషన్ మద్దతును అందిస్తున్నామని ఆయన చెప్పారు. -
ఏటీఎంల్లో నో క్యాష్ : ఊరటనిచ్చిన ఎస్బీఐ
సాక్షి, న్యూఢిల్లీ : ఏటీఎంలలో నగదు రాక, తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు ఎస్బీఐ ఊరటనిచ్చే ప్రకటన చేసింది. పాయింట్ ఆఫ్ సేల్(పీఓఎస్) మిషన్ల ద్వారా రోజుకు రూ.2000 వరకు నగదును కస్టమర్లు విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నట్టు పేర్కొంది. ‘క్యాష్@పీఓఎస్’ కార్యక్రమం ద్వారా ఈ క్యాష్ విత్‌డ్రా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు తెలిపింది. ఏటీఎంల వద్ద నగదు దొరకని కస్టమర్లకు ఇది గుడ్న్యూస్గా మారింది. ‘క్యాష్@పీఓఎస్’ సౌకర్యం ద్వారా డెబిట్ కార్డుదారులు ఎస్బీఐ పీఓఎస్ టర్మినల్స్ వద్ద డెబిట్/ప్రీపెయిడ్ కార్డులను స్వైప్ చేసి నగదును విత్‌డ్రా చేసుకోవచ్చని ఎస్బీఐ ప్రకటించింది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం టైర్ 1, టైర్ 2 నగరాల ప్రజలు ఒక్కో కార్డుపై రూ.1000 విత్‌డ్రా చేసుకోవచ్చని, టైర్ 3 నుంచి టైర్ 6 నగరాల ప్రజలు రూ.2000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చని తెలిసింది. మెర్చంట్ లొకేషన్ల వద్ద ఎస్బీఏ ఏర్పాటు చేసిన పీఓఎస్ మిషన్ల నుంచి ఎస్బీఐ, ఇతర బ్యాంకుల డెబిట్ కార్డు కస్టమర్లు ఈ విత్‌డ్రాను చేపట్టుకోవచ్చని పేర్కొంది. ప్రస్తుతం ఈ విత్‌డ్రాలకు ఎటువంటి ఛార్జీలను విధించడం లేదని కూడా ఎస్బీఐ తన ప్రకటనలో తెలిపింది. ఈ ఎలక్ట్రానిక్ డివైజ్‌ల ద్వారా రిటైల్ వ్యాపారుల వద్ద కార్డు పేమెంట్లను జరుపుకోవచ్చు. ఎస్బీఐకి ప్రస్తుతం 6.08 లక్షల పీఓఎస్ మిషన్లు ఉన్నాయి. వాటిలో 4.78 లక్షల మిషన్లను నగదును అందిస్తున్నాయి. కాగ, దేశవ్యాప్తంగా మరోసారి పెద్ద నోట్ల రద్దు సమయంలో నెలకొన్న పరిస్థితులు ఏర్పడటంతో, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో ఏటీఎంలలో నగదు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే గత 24 గంటల నుంచి నగదును అందుబాటులోకి తీసుకురావడానికి తమ ఏటీఎం నెట్‌వర్క్‌లను మెరుగుపరుస్తున్నట్టు ఎస్బీఐ చెప్పింది. రేపటి వరకు ఈ సమస్య మటుమాయమవుతుందని కూడా ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు. -
నిబంధనలు గాలికి..
బీర్కూర్: పెట్రోల్ బంకుల యజమానులు నిబంధనలను గాలికొదిలేశారు. బంకుల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. రోజురోజుకు పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతున్నా.. పెట్రోల్ బంకుల్లో వసతులు మాత్రం మెరుగవ్వడం లేదు. వివిధ రకాల పన్నుల పేరిట 35 శాతం వరకు ట్యాక్స్ వసూలు చేస్తున్న ప్రభుత్వాలు.. బంకుల్లో వినియోగదారుల సౌకర్యాలపై దృష్టి సారించడం లేదు. భద్రతా ప్రమాణాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. కొన్ని బంకుల్లో కనీసం తాగునీటి సౌకర్యం కూడా ఉండటం లేదు. గాలికొట్టే యంత్రాలేవి? నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సుమారు 180 పెట్రోల్ బంకులు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి పెట్రోల్ బంకుల్లో గాలి నింపే యంత్రాలు ఉండాలి. కోరిన ప్రతి వినియోగదారునికి ఉచితంగా గాలి నింపాలి. కానీ కొందరు బంకు నిర్వాహకులు ఖర్చుతో కూడుకున్న పనిగా భావించి వాటిని ఏర్పాటు చేయడం లేదు. కొన్ని చోట్ల ఏర్పాటు చేసినా వినియోగదారులకు అందుబాటులో ఉంచడం లేదు. ఇక, ఉచితంగా గాలి నింపాల్సి ఉండగా, వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. డిజిటల్ లావాదేవిలపై అనాసక్తి పెద్దనోట్ల రద్దు తర్వాత నగదు కొరతను అధిగమించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేలా అన్ని పెట్రోల్ బంకుల్లో స్వైప్ (పీవోఎస్) మిషన్లను ఉపయోగించాలని స్పష్టం చేశాయి. అయితే, చాలా బ్యాంకుల్లో పీవోఎస్ యంత్రాలను మూలన పడేశారు. ఎవరైనా ఏటీఎం కార్డు లావాదేవీలను అసలే అంగీకరించట్లేదు. ఏమైనా అంటే పీవోఎస్ మిషన్ చెడిపోయిందని సమాధానమిస్తున్నారు. బంకులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నా సంబంధిత శాఖలు స్పందించడం లేదు. పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ శాఖ టాస్క్ఫోర్సు బృందం బంకుల్లో తనిఖీలు చేపట్టి నిబంధనల ప్రకారం వినియోగదారులకు మెరుగైన వసుతులతో పాటు డిజిటల్ లావాదేవీలు అందుబాటులోకి తేవాలని వినియోగదారులు కోరుతున్నారు. నాణ్యతా ప్రమాణాలు అంతే.. వాహనదారులు పెట్రోల్, డీజిల్ నాణ్యతపై అనుమానం వస్తే, తక్షణమే నివృత్తి చేసే ఉపకరణాలు అందుబాటులో ఉండాలి. నాణ్యత నిర్ధారణకు ఫిల్టర్ పేపర్, డెన్సిటీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఏమాత్రం అనుమానం వచ్చినా పౌరసరఫరాలశాఖ, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయాలి. కానీ వాహనదారులకు ఆయా నిబంధనలపై అవగాహన లేకపోవడంతో బంకుల యాజమాన్యాల ఇష్టారాజ్యం నడుస్తోంది. అవగాహన ఉన్న వారు అడిగితే సమాధానం చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. భద్రతా చర్యలు అంతంత మాత్రమే పెట్రోల్ బంకుల్లో భద్రతా చర్యలు అంతంత మాత్రంగానే దర్శనమిస్తున్నాయి. బంకుల్లో ఇసుక బకెట్లు, అగ్ని ప్రమాద నివారణ పరికరాలు అలంకార ప్రా యంగానే ఉంటున్నాయి. వాహనదారు లు అటుంచి, బంకు నిర్వాహకులే సె ల్ఫోన్లో మాట్లాడుతూ పెట్రోల్ పోస్తున్నారనే అరోపణలు ఉన్నాయి. ఫస్ట్ ఎయిడ్ కిట్లు కూడా ఎక్కడా కనిపించడం లేదు. కానరాని శౌచాలయాలు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు, ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి బంకులో మరుగుదొడ్లతో పాటు కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా షెడ్డు ఉండాలి. కానీ చాలా చోట్ల టాయిలెట్ సౌకర్యమే లేకపోవడంతో వినియోగదారులు ముఖంగా మహిళలు ఇబ్బం ది పడాల్సి వస్తోంది. కేంద్ర ప్రభు త్వం అంత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న స్వచ్ఛభారత్ కల సాకారం కాకుండా పోతోంది. -
2022 నాటికి వాటి అవసరమే ఉండదట!
న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవాలకు లభిస్తున్న ప్రోత్సాహం నేపథ్యంలో రానున్నకాలంలో ఏటీఎం కార్డులు, మెషీన్లకు ఇక కాలం చెల్లినట్టేనట. పెద్ద నోట్ల రద్దు తరువాత, 2022 నాటికి ఏటీఎంకార్డులు, పీఓఎస్ మెషీన్ల అవసరం ఉండదని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు. యూత్ ప్రవాసీ భారతీయ దివస్ 2017లో బాగంగా నిర్వహించిన సెషన్లో ప్రసంగించిన కాంత్, ప్రతి భారతీయుడూ కేవలం తన బొటనవేలిని, మొబైల్ ఫోన్ ద్వారా అన్ని లావాదేవీలు జరుపుతున్న నేపథ్యంలో ఇక కార్డులు వ్యర్థంగా మారిపోతాయని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల, డిజిటల్ చెల్లింపులు భారీ స్థాయిలో జరుగుతాయని, ప్రపంచంలోనే వందకోట్ల (బిలియన్) మొబైల్ కనెక్షన్లు, వందకోట్ల బయోమెట్రిక్‌లను కలిగిన ఏకైక దేశంగా భారత్ అవతరించిందని కాంత్ పేర్కొన్నారు. ఇటీవల విడుదల భీమ్ యాప్ , ఆధార్ ఆధారిత సేవలను గుర్తు చేశారు. సాంకేతికంగా శరవేగంగా జరుగుతున్న మార్పులు, డిజిటల్ చెల్లింపుల పురోగతి కారణంగా మరో మూడేళ్లలోనే భారత్‌లో ఏటీఎంలు, క్రిడిట్ కార్టులు అదృశ్యం కానున్నాయని చెప్పారు. ద్రవ్య సాంకేతికత మరియు సామాజిక ఆవిష్కరణల పరంగా భారత్ శరవేగంగా మార్పులకు గురికానుందని, ఈ నేపథ్యంలో వచ్చే రెండున్నరేళ్ల కాలంలోనే భారత్‌లో డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఏటీఎంలు, పీఓఎస్ మెషీన్లు దండగే అని చెప్పారు. ఆదార్ కార్డ్ ఆధారిత టెక్నాలజీ వల్ల ప్రతి లావాదేవీ కూడా కేవలం 30 సెకన్లలో పూర్తవుతుందన్నారు. దేశంలోఇంతవరకు 85శాతం లావాదేవీలు నగదు రూపంలో జరుగుతుండగా, దేశంలో అతికొద్దిమంది మాత్రమే పన్నులు చెల్లిస్తున్నారని అందుకే డిజిటల్ లావాదేవీలు, నియత ఆర్థిక వ్యవస్థను రూపొందిం చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చట్టబద్ధంగా రెండు లక్షల కో్ట్ల డాలర్లు చలామణిలో ఉంటూ మరొక లక్ష కోట్ల డాలర్లు అనియతరంగంలో నల్ధ ఆర్థిక వ్యవస్థగా ఉంటున్న స్థితిలో భారత్ పది లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే అసాధ్యమన్నారు. ఇలాంటి నేపథ్యంలో భారత్ అభివృద్ధి చెందడమే సాధ్యం కాదని చెప్పారు. వ్యాపార సరళీకరణలో ప్రభుత్వం చేపట్టిన వివిధ సంస్కరణలు ఎఫ్ డీఐ వృద్ధికి దారితీసిందన్నారు. దేశంలో ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారానికి, ఉద్యోగ సృష్టిలో ప్రభుత్వ కృషిని ఆయన నొక్కి చెప్పారు. యూరోప్, అమెరికాలో జనాభా పెద్దవాళ్ల సంఖ్య పెరుగుతోంటే, మనదేశంలో మాత్రం యువత సంఖ్య బాగాపెరుగుతూ ఉండడం అతిపెద్ద సాంఘిక, ఆర్థిక అద్భుతమని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితుల్లోనూ భారత్ వృద్ధి రేటు 7.6 శాతంతో కొనసాగడం గమనించాలన్నారు. అభివృద్ధిలో కుంటుపడిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఇప్పటికీ ఒయాసిస్‌గానే ఉందని నీతి అయోగ్ సీఈఓ అభిప్రాయపడ్డారు. -
పెద్ద నోట్ల రద్దు.. చైనాకు పండగ!
న్యూఢిల్లీ: మన దేశంలో అధిక విలువ కలిగిన నోట్ల రద్దు పొరుగు దేశమైన చైనాకు కలిసి వచ్చేలా చేసింది. నగదు రహిత లావాదేవీల వ్యవస్ధ అవినీతి అంతమొందిస్తుందంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్ద నోట్లను రద్దు చేశారు. నాటి నుంచి నేటి వరకూ చేతిలో డబ్బు కోసం దేశమంతా బ్యాంకుల ముందు క్యూ కట్టింది. దీంతో డిజిటల్ లావాదేవీల సంఖ్యను పెంచేందుకు పాయింట్ ఆఫ్ సేల్(పీఓఎస్) లేదా స్వైపింగ్ మిషన్లను 10 వేలకు పైచిలుకు జనాభా ఉన్న ప్రతి గ్రామంలోనూ అందుబాటులో ఉంచుతామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే కేవలం నగరాల్లో మాత్రమే విరివిగా అందుబాటులో ఉన్న పీఎస్ఓ మిషన్లను గ్రామాల్లో ప్రవేశపెట్టడానికి కొరత ఏర్పడింది. దేశీయంగా పీఎస్‌ఓలను తయారుచేసే కంపెనీలకు అవసరమైన మేరకు తక్కువ సమయంలో లోటును పూడ్చే సామర్ధ్యం లేకపోవడంతో చైనాలోని రెండు కంపెనీల నుంచి పీఎస్ఓ లను దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్ధిక శాఖ సంబంధిత కన్సల్టేటివ్ కమిటీ సమావేశ అనంతరం ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ విషయాన్ని వెల్లడించారు. చైనా నుంచి దిగుమతి చేసుకునే మిషన్లపై దిగుమతి సుంకాన్ని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. దీంతో మిషన్లు తక్కువ ధరలకే వ్యాపారులకు అందుతాయని పేర్కొన్నారు. దిగుమతి చేసుకోవాల్సిన పీఎస్ఓల సంఖ్య లక్షల్లో ఉండటంతో నోట్ల రద్దు వల్ల చైనాకు భారీగానే కలిసివచ్చినట్లయింది. చైనా నుంచి వచ్చే ఈ మిషన్లు భారత్ కు చేరేసరికి మరికొద్ది వారాలు పడతాయని ఇప్పటికే బ్యాంకులు ప్రజలకు తగినంత డబ్బును అందించడంలో విఫలం చెందుతున్నాయని జాతీయ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. -
పీఓఎస్ యంత్రాలకు దరఖాస్తు చేసుకోండి
అనంతపురం అర్బన్ : పాయింట్ ఆఫ్ సేల్స్ (పీఓఎస్) స్వైప్ యంత్రాల కోసం డీలర్లు, వర్తకులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఓ ప్రకటనలో సూచించారు. దరఖాస్తులను ఆర్డీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో స్వీకరిస్తారన్నారు. జిల్లాలోని చౌక దుకాణాల డీలర్లు, గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ బంకులు యజమానులు ఇలా అన్ని రకాల వర్తకులు, వ్యాపారులు తప్పని సరిగా పీఓఎస్ యంత్రాల ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలన్నారు. ఇందులో ఎలాంటి జాప్యానికి తావివ్వకుండా యంత్రాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.