న్యూఢిల్లీ: వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం అదేబాటలో నడిచాయి. తమ వంతుగా విలువ ఆధారిత పన్ను(వ్యాట్) తగ్గించాయి. దీంతో 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు మరింత కిందికి దిగొచ్చాయి. కర్ణాటక, పుదుచ్చేరి, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, అస్సాం, సిక్కిం, బిహార్, మధ్యప్రదేశ్, గోవా, గుజరాత్, దాద్రా నగర్ హవేలి, డయ్యూడామన్, చండీగఢ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, లద్ధాఖ్‌లో ‘వ్యాట్’ తగ్గింది.
కాంగ్రెస్-దాని భాగస్వామ్య పక్షాలు, వామపక్షాలు, ఇతర పార్టీల ప్రభుత్వాలున్న రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గింపు విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాజస్తాన్, పంజాబ్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో వ్యాట్ వాత యధాతథంగా కొనసాగుతోంది. ఎక్సైజ్ సుంకం తగ్గింపు తర్వాత దేశంలోనే అత్యధికంగా రాజస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రేటు రూ.111.10, డీజిల్ రూ.95.71, ముంబైలో పెట్రోల్ రూ.109.98, డీజిల్ రూ.94.14 పలుకుతోంది. అన్ని రాష్ట్రాల కంటే తక్కువగా మిజోరాంలో లీటర్ డీజిల్ ధర రూ.79.55కు చేరింది.
చదవండి: (మాజీ మంత్రిని నిర్బంధించిన రైతులు.. చేతులు జోడించి క్షమాపణ చెప్పాకే..)
Comments
Please login to add a commentAdd a comment