ముంబై: పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం పెట్రోల్, డీజిల్ పై లీటరకు రూ.1.50 సుంకాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. గతంలో సాధారణ రకం లీటరు పెట్రోల్ పై ఉన్న రూ.1.20 ఎక్సైజ్ సుంకాన్ని రూ.2.70 పెంచగా, బ్రాండెడ్ పెట్రోల్ పై ఉన్న సుంకాన్ని రూ.2.35 నుంచి రూ. 3.85కు పెంచింది.
డీజిల్ పై కూడా ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. అంతకుముందు సాధారణ రకం డీజిల్ పై ఉన్న రూ.1.46 ఎక్సైజ్ సుంకపు విలువను రూ.2.96కు పెంచగా, బ్రాండెడ్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.3.75 నుంచి రూ. 5.25 కు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.