చిల్లరపేరిట బీరుపై బాదుడు! | tsbcl raise liquor bottle cost | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 4 2016 7:21 AM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM

మందుబాబుల జేబులు లూటీ కానున్నాయి! రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు పెంచేసింది. వివిధ రకాల మద్యంపై 6 శాతం నుంచి 10 శాతం ధరలు వడ్డించింది. ఈ ధరల పెంపుతో సర్కారు ప్రతినెలా దాదాపు రూ.50 కోట్ల (ఏడాదికి రూ.600 కోట్లు) అదనపు ఆదాయం ఆర్జించనుంది. తెలంగాణ స్టేట్ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌బీసీఎల్) పంపిన ధరల పెంపు ప్రతిపాదనలను ఏడాది పాటు పెండింగ్‌లో ఉంచిన ప్రభుత్వం శనివారం నుంచే వాటిని అమల్లోకి తెచ్చింది. రూ. 5తో ముడిపడి ఉన్న మద్యం అమ్మటం ఇబ్బందిగా ఉందని, రూ.5 చిల్లర, నాణేలను తిరిగివ్వటం సమస్యగా మారినందున ధరలు పెంచినట్లు ప్రకటించింది. రూ.5తో ముడిపడి ఉన్న మద్యం ధరలను రూ.10 ఉండేలా సవరించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement