
పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం పెంపు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచింది. లీటర్ పెట్రోల్ కు రూ. 2.25, లీటర్ డీజిల్ కు రూపాయి చొప్పున ఎక్సైజ్ సుంకం పెంచింది. పెంపు ప్రభావం వినియోగదారులపై ఉండబోదు. పెంచిన సుంకం ఈరోజు(మంగళవారం) నుంచి అమల్లోకి రానుంది. మూడు వారాల వ్యవధిలో ఎక్సైజ్ సుంకం పెంచడం ఇది రెండోసారి. నవంబర్ 12న పెట్రోల్, డీజిల్ పై లీటర్ కు రూ.1.50 చొప్పున పెంచింది.
ప్రభుత్వ చమురు సంస్థలు సోమవారం పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గించాయి. అంతర్జాతీయంగా చమురు రేట్లలో తగ్గుదల కారణంగా పెట్రోల్ పై లీటర్ కు 91 పైసలు, డీజిల్ పై 84 పైసలు తగ్గించాయి.