న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం పెంచింది. పెట్రోల్, డీజిల్ పై లీటరు రెండు రూపాలయ చొప్పున ఎక్సైజ్ సుంకం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే రిటైల్ ధరలపై ఈ ప్రభావం పడకుండా చమురు కంపెనీలు జాగ్రత్తపడ్డాయి. అంతర్జాతీయంగా కొనసాగుతున్న ముడి చమురు ధరల తగ్గుదలను ఎక్సైజ్ సుంకం రూపంలో ఆయిల్ కంపెనీలు సర్దుబాటు చేశాయి.