
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు తాజాగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం పెంచడంతో వాటి ధరలకు రెక్కొలొచ్చాయి. పెట్రోలు, డీజిల్ పై లీటరుకు రూ.1.50 చొప్పున ధరలు పెరిగాయి. దీంతో ప్రభుత్వానికి రూ. 13 వేల కోట్ల మేర ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గురువారం పెట్రోల్, డీజిల్ పై లీటరకు రూ.1.50 సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.
గతంలో సాధారణ రకం లీటరు పెట్రోల్ పై ఉన్న రూ.1.20 ఎక్సైజ్ సుంకాన్ని రూ.2.70 పెంచగా, బ్రాండెడ్ పెట్రోల్ పై ఉన్న సుంకాన్ని రూ.2.35 నుంచి రూ. 3.85కు పెంచింది. అంతకుముందు సాధారణ రకం డీజిల్ పై ఉన్న రూ.1.46 ఎక్సైజ్ సుంకపు విలువను రూ.2.96కు పెంచగా, బ్రాండెడ్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని రూ.3.75 నుంచి రూ. 5.25 కు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.