అరచేతి ఆభరణం | Palm ornament | Sakshi
Sakshi News home page

అరచేతి ఆభరణం

Published Wed, Oct 29 2014 11:37 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

అరచేతి ఆభరణం - Sakshi

అరచేతి ఆభరణం

ఆధునికం
 
కథానాయికలు ఏం చేసినా అందమే! అలంకరణకు కొత్త భాష్యం చెప్పడానికి వారు రకరకాల పద్ధతులను అవలంబిస్తుంటారు. అవి అందరినీ ఆకర్షిస్తుంటాయి. అనుసరించేలా చేస్తుంటాయి. ఇటీవల హాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి అటు నుంచి మన తెలుగు చిత్రసీమకు పరిచయం అయిందో ఆభరణం. ‘పామ్ కఫ్’గా పిలిపించుకుం టున్న ఈ అరచేతి ఆభరణానికి ఇటీవల క్రేజ్ వచ్చేసింది.  సంప్రదాయ దుస్తులైనా, ఆధునిక వేషధారణ అయినా ఈ అరచేతి ఆభరణాన్ని ధరిస్తే ఫ్యాషనబుల్ అనిపిస్తారు.

అందుకేనేమో అమెరికా నుంచి ఆసియా వరకు ప్రపంచ సుందరీమణులు అనదగ్గ వారిందరి కోమలమైన చేతులకు ఇది కొత్త కాంతులిస్తోంది. గాజు మాదిరిగానూ, బ్రేస్‌లెట్ లాగానూ, అత్యంత సౌకర్యమైన ఆభరణంగానూ పలువురు మెచ్చుకుంటున్న ‘పామ్ కఫ్’ ప్రస్తుతం ఓ ట్రెండ్‌గా నడుస్తోంది. ఇవి బంగారు, వెండి, కాపర్, ఐరన్‌లలో.. ఎన్నో విభిన్న ఆకృతులతో అతివలను అలరిస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement