యాంత్రీకరణ పరికరాలను పరిశీలిస్తున్న వ్యవసాయశాఖ అధికారులు
ఆధునిక పద్ధతితో అధిక దిగుబడులు
Published Fri, Aug 12 2016 10:37 PM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM
షాద్‌నగర్ రూరల్ : రైతులు ఆధునిక పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని ఏడీఏ సుధారాణి సూచించారు. శుక్రవారం షాద్‌నగర్ డివిజన్ పరిధిలోని కమ్మదనం, మధురాపూర్, ఉత్తరాశిపల్లి, ముట్పూరు, చెరుకుపల్లిలో వ్యవసాయశాఖ అధికారులు పర్యటించారు. ఈ సందర్భంగా సబ్సిడీపై పొందిన పొలం యాంత్రీకరణ పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాగా, పంట మార్పిడితో పంట ఎక్కువగా పండుతుందని, ట్రాక్టరుతో నడిచే పరికరాలకు బడ్జెట్ పెంచాలని రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ భిక్షపతి, ఏఓలుప్రశాంతి, శిరీష, రవి తదితరులు పాల్గొన్నారు.
Advertisement