ప్రఖ్యాత నవలా రచయిత్రి, జర్నలిస్టు శోభా డే గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు. తన రచనలతో దేశవ్యాప్తంగా గొప్ప రచయిత్రిగా పేరొందారు. ప్రముఖ కాలమిస్గా అనేక విషయాలపై రచనలు చేశారు. ఆమె పుస్తకాలు ఎక్కువగా సామాజికవేత్తలు, బాలీవుడ్ పరిశ్రమ ఇలాంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి ఆమెను ప్రపంచ స్థాయి రచయిత్రి జాకీ కాలిన్స్‌తో పోలుస్తారు. ఆమె సోషల్ మీడియా పోస్ట్‌లు అడపాడదపా వివాదాల్ని కూడా రాజేసేవి. తాజాగా ఆమె తన పెద్ద కుమారుడు వేడుకలో అందంగా కనిపించింది. కుమారుడు పెళ్లి ఫోటోలతోపాటు, పట్టుచీరలో ఆకట్టుకుంటున్న శోభాడే నెట్టింట సందడి చేస్తున్నాయి.
శోభాడే కుమారుడు పెళ్లి
శోభాడే పెద్ద కుమారుడు ఆదిత్య కిలాచంద్, తన స్నేహితురాలు నటాషా అద్వానీని పెళ్లాడాడు. ముంబైలో వైభవంగా జరిగిన ఈ పెళ్లివేడుకు టాక్ ఆఫ్‌ది టౌన్‌గా మారింది. ఈ వివాహం హిందూ సంప్రదాయాల ప్రకారం, కుటుంబసభ్యులు, సన్నిహితులుహాజరయ్యారు. ప్రఖ్యాత బ్రాండ్ అబు జానీ సందీప్ ఖోస్లా రూపొందించిన డ్రెస్‌లో నటాషా పెళ్లి లుక్, వధూవరుల చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ముఖ్యంగా నటాషా అద్వానీ బంగారు లెహంగా అందరి దృష్టిని ఆకర్షించింది. భారీ ఎంబ్రాయిడరీతో చేసిన గోల్డెన్ కలర్ లెహంగా, మ్యాచింగ్ దుపట్టాతో జత చేసింది. దీనికి మ్యాచింగ్‌గా ఎరుపు ,బంగారు గాజులు, చూడామణి, బంగారు నెక్లెస్‌ను వేసుకుంది. మరోవైపు, ఆదిత్య తెల్లటి ఎంబ్రాయిడరీ షేర్వానీ, ఐవరీ-హ్యూడ్ స్టోల్‌తో మెరిసాడు.
శోభాడే చీర
కుమారుడు పెళ్లికి మీనాకారి వర్క్‌తో, స్పెషల్ మోటిఫ్‌లతో తయారు చేసిన ఎరుపు-రంగు స్వచ్ఛమైన పట్టు కటాన్ ప్రష్యన్ రౌలెట్ చీరను ధరించింది. ఇంకా ఆమె వేసుకున్న నెక్ పీస్, పాపిట బిళ్ల, ముక్కెర, చేతి ఉంగరాలు ఇలా ప్రతీదీ తళుక్కున మెరిసాయి.
ఇదీ చదవండి: చివరకు మిగిలేది! ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గుండెలు పగిలే స్టోరీ
శోభాడే భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన రచయితలలో ఒకరు. ఆమె జర్నలిజంలోకి అడుగు పెట్టడానికి ముందు మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది, 1990లలో స్టార్‌డస్ట్ మ్యాగజైన్‌కు సంపాదకురాలిగా పనిచేసింది.. బాలీవుడ్, సమాజం ,సంబంధాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా ప్రకటించేది. సంపాదించింది. సోషలైట్ ఈవినింగ్స్, స్టార్రీ నైట్స్, సెకండ్ థాట్స్ , స్మాల్ బిట్రయల్స్ లాంటి ఆమె పాపులర్ రచనలు. ఆమె భర్త దిలీప్ దే.ఇద్దరు సవతి పిల్లలతో సహా ఆరుగురు పిల్లల తల్లి శోభాడే.
కాగా ఆదిత్య కిలాచంద్ శోభా డే మాజీ భర్త సుధీర్ కిలాచంద్ కుమారుడు. అలీబాగ్‌లోని లగ్జరీ వెల్నెస్ విల్లా ప్రాజెక్ట్ అవాస్ వెల్నెస్ ఫౌండర్ సీఈవో కూడా. ఆదిత్య 1970లలో జన్మించాడు.అమెరికాలో ఉన్నత చదువు పూర్తి చేసిన ఇండియాలో వ్యాపారంలోకి ప్రవేశించాడు.
చదవండి: కేరళ ర్యాగింగ్ : ‘నా మేనల్లుడే..’వ్యాపారవేత్త చెప్పిన భయంకర విషయాలు
Comments
Please login to add a commentAdd a comment