Shobha De
-
నటాషా అద్వానీతో కొడుకు పెళ్లి : చీరలో శోభాడే స్టన్నింగ్ లుక్
ప్రఖ్యాత నవలా రచయిత్రి, జర్నలిస్టు శోభా డే గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు. తన రచనలతో దేశవ్యాప్తంగా గొప్ప రచయిత్రిగా పేరొందారు. ప్రముఖ కాలమిస్గా అనేక విషయాలపై రచనలు చేశారు. ఆమె పుస్తకాలు ఎక్కువగా సామాజికవేత్తలు, బాలీవుడ్ పరిశ్రమ ఇలాంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి ఆమెను ప్రపంచ స్థాయి రచయిత్రి జాకీ కాలిన్స్‌తో పోలుస్తారు. ఆమె సోషల్ మీడియా పోస్ట్‌లు అడపాడదపా వివాదాల్ని కూడా రాజేసేవి. తాజాగా ఆమె తన పెద్ద కుమారుడు వేడుకలో అందంగా కనిపించింది. కుమారుడు పెళ్లి ఫోటోలతోపాటు, పట్టుచీరలో ఆకట్టుకుంటున్న శోభాడే నెట్టింట సందడి చేస్తున్నాయి.శోభాడే కుమారుడు పెళ్లిశోభాడే పెద్ద కుమారుడు ఆదిత్య కిలాచంద్, తన స్నేహితురాలు నటాషా అద్వానీని పెళ్లాడాడు. ముంబైలో వైభవంగా జరిగిన ఈ పెళ్లివేడుకు టాక్ ఆఫ్‌ది టౌన్‌గా మారింది. ఈ వివాహం హిందూ సంప్రదాయాల ప్రకారం, కుటుంబసభ్యులు, సన్నిహితులుహాజరయ్యారు. ప్రఖ్యాత బ్రాండ్ అబు జానీ సందీప్ ఖోస్లా రూపొందించిన డ్రెస్‌లో నటాషా పెళ్లి లుక్, వధూవరుల చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ముఖ్యంగా నటాషా అద్వానీ బంగారు లెహంగా అందరి దృష్టిని ఆకర్షించింది. భారీ ఎంబ్రాయిడరీతో చేసిన గోల్డెన్ కలర్ లెహంగా, మ్యాచింగ్ దుపట్టాతో జత చేసింది. దీనికి మ్యాచింగ్‌గా ఎరుపు ,బంగారు గాజులు, చూడామణి, బంగారు నెక్లెస్‌ను వేసుకుంది. మరోవైపు, ఆదిత్య తెల్లటి ఎంబ్రాయిడరీ షేర్వానీ, ఐవరీ-హ్యూడ్ స్టోల్‌తో మెరిసాడు.శోభాడే చీర కుమారుడు పెళ్లికి మీనాకారి వర్క్‌తో, స్పెషల్ మోటిఫ్‌లతో తయారు చేసిన ఎరుపు-రంగు స్వచ్ఛమైన పట్టు కటాన్ ప్రష్యన్ రౌలెట్ చీరను ధరించింది. ఇంకా ఆమె వేసుకున్న నెక్ పీస్, పాపిట బిళ్ల, ముక్కెర, చేతి ఉంగరాలు ఇలా ప్రతీదీ తళుక్కున మెరిసాయి. ఇదీ చదవండి: చివరకు మిగిలేది! ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గుండెలు పగిలే స్టోరీశోభాడే భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన రచయితలలో ఒకరు. ఆమె జర్నలిజంలోకి అడుగు పెట్టడానికి ముందు మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది, 1990లలో స్టార్‌డస్ట్ మ్యాగజైన్‌కు సంపాదకురాలిగా పనిచేసింది.. బాలీవుడ్, సమాజం ,సంబంధాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా ప్రకటించేది. సంపాదించింది. సోషలైట్ ఈవినింగ్స్, స్టార్రీ నైట్స్, సెకండ్ థాట్స్ , స్మాల్ బిట్రయల్స్ లాంటి ఆమె పాపులర్ రచనలు. ఆమె భర్త దిలీప్ దే.ఇద్దరు సవతి పిల్లలతో సహా ఆరుగురు పిల్లల తల్లి శోభాడే.కాగా ఆదిత్య కిలాచంద్ శోభా డే మాజీ భర్త సుధీర్ కిలాచంద్ కుమారుడు. అలీబాగ్‌లోని లగ్జరీ వెల్నెస్ విల్లా ప్రాజెక్ట్ అవాస్ వెల్నెస్ ఫౌండర్ సీఈవో కూడా. ఆదిత్య 1970లలో జన్మించాడు.అమెరికాలో ఉన్నత చదువు పూర్తి చేసిన ఇండియాలో వ్యాపారంలోకి ప్రవేశించాడు.చదవండి: కేరళ ర్యాగింగ్ : ‘నా మేనల్లుడే..’వ్యాపారవేత్త చెప్పిన భయంకర విషయాలు -
శోభా డే ట్వీట్: మెగా ఫ్యాన్స్ ఆగ్రహం
సినీ ఇండస్ట్రీలో ఉంటూ, అది కూడా ఓ తెలుగు చిత్రంలో నటించిన మీరా చోప్రా.. తనకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎవరో తెలీదంటూ నోరు జారారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఆమెపై బెదిరింపులకు పాల్పడుతూ, తీవ్ర దూషణలకు దిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఓ రచయిత్రి కూడా పెద్ద తప్పులో కాలేసి వివాదంలో ఇరుక్కున్నారు. కన్నడ హీరో చిరంజీవి సర్జా(39) ఆదివారం గుండెపోటుతో మరణించగా.. పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులు సోషల్ మీడియాలో దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రచయిత్రి శోభా డే కూడా ట్విటర్లో ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. (‘బహుశా ఇంకో మూడేళ్లే బతుకుతాను’) ‘మరో దిగ్గజ నటుడిని కోల్పోయాం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.." అంటూ ట్వీట్ చేశారు. అయితే దీనికి చిరంజీవి సర్జా ఫొటోకు బదులుగా మెగాస్టార్ చిరంజీవి ఫొటోను పెట్టి శ్రద్ధాంజలి ఘటించారు. దీంతో ఒక్కసారిగా షాకైన మెగా అభిమానులు ఆమెపై తీవ్రంగా మండిపడుతున్నారు. శోభాడే క్షమాపణ చెప్పాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు. "ప్రియమైన బాలీవుడ్ సెలబ్రిటీలారా.. మీకు మా నటీనటుల గురించి తెలీకపోతే ట్వీట్ చేయకండి.. అంతేకానీ మీ మూర్ఖత్వాన్ని ప్రదర్శించకండి" అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. "నువ్వు చచ్చిపోయావు, నీకది తెలియట్లేదు.." అంటూ కొందరు వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. తన తప్పు తెలుసుకున్న శోభా డే వెంటనే సదరు ట్వీట్‌ను తొలగించారు. (హీరో చిరంజీవి సర్జా హఠాన్మరణం) -
'ఒలింపిక్స్ లో భారత ప్రాతినిథ్యం శుద్ధ దండగ'
ఢిల్లీ: రియో ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొంటున్న భారత అథ్లెట్లపై ప్రముఖ రచయిత్రి శోభా డే సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఒలింపిక్స్ లో భారత ప్రాతినిథ్యం అనేది శుద్ద దండగ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం పతకాలు తేలేనప్పుడు ఒలింపిక్స్‌కు వెళ్లడం అనవసరమని విమర్శనాస్త్రాలు సంధించారు. కేవలం అక్కడ సెల్ఫీలు తీసుకోవడానికే ఆసక్తి చూపిస్తున్న భారత క్రీడాకారులు.. తమ తమ ప్రదర్శనలపై మాత్రం దృష్టి పెట్టడం లేదన్నారు. ఈ వృథా ప్రయాసతో చాలా ధనవ్యయం తప్పితే ఏమీ కనిపించడం లేదన్నారు. అయితే దీనిపై భారత షూటర్ అభినవ్ బింద్రా, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలాలు స్పందించారు. ఈ తరహా విమర్శలు చేయడం శోభా డేకు తగదని, ఒక మెగా ఈవెంట్లో భారత్ ప్రాతినిథ్యం ఉన్నందుకు సంతోషించాలని బింద్రా తెలపగా, ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న అథ్లెట్లపై విమర్శలు చేస్తూ నిరూత్సాహపరచడం తగదని గుత్తా జ్వాలా పేర్కొంది. మరోవైపు నెటిజన్లు సైతం శోభా తీరును తప్పుబట్టారు. ఏదొక వంకతో సోషల్ మీడియాలోకి రావడం, విమర్శలు చేయడం కొంతమంది సెలబ్రెటీలకు పరిపాటిగా మారిపోయిందని నెటిజన్లు మండిపడ్డారు. -
ఆరుపదుల్లోనూ అందంగా...
సాధారణంగా ‘ఫ్యాషన్’ అనగానే అందరూ ‘యువతకు మాత్రమే’ కదా... అనుకుంటారు. ఫ్యాషన్ షోలు.. ర్యాంప్ వాక్‌లు వారికోసమేనని భావిస్తుంటారు. కానీ ఫ్యాషన్ ఒక వయసుకు మాత్రమే చెందినది కాదు. అన్ని వయసుల వారికీ ‘ఫ్యాషన్ మంత్ర’ అవసరమైనదే! బాలీవుడ్ తారలు హేమమాలిని, షబానా అజ్మి, శోభా డే, కిరణ్ ఖేర్...లు ఆరుపదుల వయసులోనూ అందంగా కనిపిస్తుంటారు. యవ్వనంలో ఉన్నప్పుడు వారు అప్పటి ట్రెండ్స్‌ను అనుసరించారు. వయసు పైబడ్డాక వచ్చిన హుందాతనాన్ని తమ వేషధారణతో అందంగా మలచుకుని ఇప్పటికీ అబ్బురపరుస్తుంటారు. వార్ధక్యం ఓ వరంగా భావించే అందరూ తమ శరీరాకృతికి తగిన వేషధారణతో ఎదుటివారి ప్రశంసలను పొందుతుంటారు. ప్రయత్నిస్తే ‘ఫ్యాషన్ ఐడల్’ అనే కితాబును మీరూ పొందవచ్చు. నూరేళ్లలో కేవలం నూరు వసంతాలు మాత్రమే చూస్తారనుకుంటే పొరబాటు. ప్రతి మాసం వసంత ం, ప్రతి రుతువు ప్రీతికరమైన క్రతువు కావాలంటున్నారీ నారీనరులైన నిత్యయువకులు. యాభై ఏళ్లుగా తడబడని అడుగులతో మడమ తిప్పని సినీ రాఘవ ఓ ఉదాహరణ. ఎనభైమూడేళ్ల ఈ వయసులోనూ నా మనసుకు ఇరవై మూడే... అంటున్న సింగీతం మరో తారా తార్కాణం. పొట్ట చెత్తబుట్ట కాదనీ... మేనిని మెరిపించే పోషకాల సెజ్జ అని, యౌవనపాఠాలకు ఒజ్జ అనీ చెప్పే రేఖ మాటలను మీ చేతి రేఖలుగా చేసుకోండి. నిత్యయౌవనులైన వాళ్లను ఫాలో అవ్వండి. ఎప్పటికీ యంగ్ఫెలోస్గా ఉండండి. వీళ్లు... కదంతొక్కుతూ, పదం పాడుతూ హృదంతరాళం గర్జిస్తూ ఉండే యువపెద్దలు. వీళ్లు... ఆరుపదుల్లో పదహారుల స్ఫూర్తి పరవళ్లు తొక్కే ఉరవళ్ల వాగులు.ఇక కృష్ణా రామా అనుకునే వయసులో యువతకు గీతోపదేశాలూ, చెడు పట్ల అసురసంహారాలు చేసీ, చేయించే వృద్ధయువతరం వీళ్లు. క్యాలెండర్ సాక్షిగా పుట్టి,తేదీలూ, ఏడాదుల పరంగా మాత్రమే యువకులై... ప్రవృత్తిపరంగా మాత్రం ఎముకలు కుళ్లీ, వయసు మళ్లీ ప్రవర్తిస్తుంటే వాళ్లలో నెత్తురు మండించీ, శక్తులు నిండించీ స్ఫూర్తిని రగిలించే సీనియర్ సిటిజెన్స్ వీళ్లు. వీరినుంచి పాఠాలు నేర్చుకుని తమ యువజన హృదయాలను మరింత స్ఫూర్తిమంతం చేసుకోవడానికి సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా మా ‘ఫ్యామిలీ’ అన్ని పేజీలనూ ప్రతి ఫ్యామిలీలో ఉన్న ఈ యువపెద్దలకూ, పెద్దయువకులకూ సలాం చేస్తూ అంకితం చేస్తోంది సాక్షి ఫ్యామిలీ. కేశాలంకరణ ... షబానా అజ్మికి ప్రత్యేకం! బాలీవుడ్ తార షబానా అజ్మి ఆధునిక, సంప్రదాయ వేషధారణలలో కనువిందు చేస్తుంటారు. ‘దుస్తులు సౌకర్యంగా ఉంటేనే ఆత్మవిశ్వాసంగా ఉండగలం’ అంటూ ఈ వయసు వారికి మరిన్ని సూచనలు ఇస్తున్నారు. ‘కేశాలంకరణలో ఆధునికంగా కనిపించడానికి ఇష్టపడతాను. అందుకే షార్ట్ హెయిర్ కట్ని ఎంచుకుంటాను. మెరుపులీనే మేకప్‌కి దూరంగా ఉంటాను. కనులు, కేశాలు, చర్మ నిగారింపు మీద దృష్టిపెడతాను. చీరలో, పైజామా కమీజ్‌లో సంప్రదాయతను ఒలికించడమే కాదు... జీన్స్, స్కర్ట్స్ వంటి ఆధునిక దుస్తులు కూడా భయం లేకుండా ధరిస్తాను.’ ఆధునికం... శోభా డే! నవలా రచయిత్రిగా, సామాజికవేత్తగా శోభా డే పేరు చాలా మందికి సుపరిచితమైనది. 66 ఏళ్లు నిండినా ఆధునిక, సంప్రదాయ వస్త్రధారణలో ఇప్పటికీ ఫ్యాషన్‌లో ముందు వరసలో ఉంటారు శోభా డే! ‘ఎలాంటి వస్త్రధారణలో అయినా సంప్రదాయ అలంకరణ వస్తువులను పక్కన పెట్టేయాలి. సిల్క్ స్కార్ఫ్ మెడలో వేసుకుంటే మెటాలిక్ కాపర్, వెండి, ప్రాచీన కాలంనాటి నగలుగా కనిపించే చుంకీ ఆభరణాలు వయసును ఉన్నదానికన్నా తక్కువగా చూపిస్తాయి. పెద్ద కంఠహారం ధరిస్తే మెడపై ముడతలు కూడా కనిపించవు.’ కళాత్మకం... కిరణ్ ఖేర్! వెండితెర, బుల్లితెర నటిగా, టెలివిజన్ కార్యక్రమాలలో అతిథిగానూ కిరణ్ ఖేర్ అందరికీ సుపరిచితమే! పేరు చెప్పగానే ఆమె ఆహార్యం గ్రాండ్‌గా కళ్లముందు కదులుతుంది. పెద్ద అంచులున్న చీరలు, పెద్ద పెద్ద ఆభరణాలను ఆమె ధరిస్తారు. ‘ప్రాచీన కళకు ప్రతిరూపంగా నిలిచే ఆభరణాలు ఏ లోహంతో తయారైనవైనా నా అలంకరణ సామగ్రిలో భాగమైపోతాయి. ఎంబ్రాయిడరీ, చేనేత చీరలు నన్ను మరింత హుందాగా చూపిస్తాయి. అందుకే వాటినే ఇష్టపడతాను.’ సంప్రదాయం... హేమమాలిని! అందానికి సరిపోలే అర్థంలా కనిపిస్తారు హేమమాలిని. నాడు - నేడు నిగనిగలాడే మేని వర్చస్సు, దానికి తగ్గ అలంకరణ, వేషధారణతో ఆరుపదులు దాటినా ఆకర్షణీయత ఆమె సొంతం. ‘ఏజ్ లెస్ బ్యూటీ’గా పేరున్న హేమమాలిని అందాన్ని కాపాడుకోవడానికి నిత్యం జాగ్రత్తలు తీసుకుంటారు. ‘శరీరం ఫిట్‌గా ఉండటానికి సైక్లింగ్, యోగా-ప్రాణాయామం, డ్యాన్స్.. నన్ను ఇప్పటికీ యవ్వనంగా ఉంచుతున్నాయి. శాకాహారభోజనమే తీసుకుంటాను. వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటాను. అయితే ఈ సమయంలో తాజా పండ్లు తప్పనిసరిగా తీసుకుంటాను. రెండు కప్పుల గ్రీన్ టీతో నా దినచర్య మొదలవుతుంది. ఎక్కువగా మంచినీరు, మజ్జిగ తీసుకుంటుంటాను. రాత్రి ఎనిమిదిలోపు భోజనం ముగిస్తాను. మేకప్‌లో ముందుగా కళ్లకు ప్రాముఖ్యం ఇస్తాను. ఎక్కడకు వెళ్లినా కళ్లకు కాజల్, పెదాలకు లిప్‌స్టిక్ వేసుకుంటాను. రోజూ క్లెన్సింగ్ మిల్క్‌తో ముఖాన్ని శుభ్రపరుచుకుంటాను. సంప్రదాయ వస్త్రధారణ నాకు బాగా నప్పుతుంది. చీరలు వయసుకు తగిన హుందాతనాన్ని, సౌకర్యాన్ని ఇస్తాయి. అందుకే రకరకాల చీరలను ధరించడానికి ఇష్టపడతాను. అయితే ఎక్కడా ఎబ్బెట్టుగా అనిపించకుండా జాగ్రత్తపడతాను.’ -
శోభా డే పై కేసు వేస్తాం : శివసేన