నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హాయ్ సర్! నేను 5 ఇయర్స్ నుంచి ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను. తను 3 ఇయర్స్ బ్యాక్ అమెరికా వెళ్లిపోయాడు. అతని బాగోగులు తెలుసుకోవాలనే ఆశతో అతనికి ఎఫ్‌బి రిక్వెస్ట్ పెట్టాను. ‘ఒక అబ్బాయికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడం అదే ఫస్ట్ అండ్ లాస్ట్.’ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారనే భయంతో తన బర్త్‌డే రోజునే ప్రపోజ్ చేశాను. ‘ఐ లవ్ యూ’ అంటే ‘థ్యాంక్యూ’ అన్నాడు. నా ఎఫ్‌బీ పోస్ట్‌లకు లైక్ కూడా కొట్టడు. మిగిలిన అమ్మాయిల విషయంలో కామెంట్స్ పెడుతుంటాడు.
వాళ్ల ఇంట్లో వాళ్లకి నేనంటే చాలా ఇష్టం. ఈ విషయం ఇంట్లో చెప్పి సంబంధాలు ఆపుదామా అంటే... ‘తను నిన్ను ఇష్టపడుతున్నాడా..?’ అనే ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. నా బ్రైనేమో... ‘రెస్పెక్ట్ ఇవ్వని వాడితో పెళ్లి ఎందుకు?’ అంటోంది. నా మనసేమో తనతో జీవితాన్ని కోరుకుంటోంది. వేరే వాళ్లని భర్తగా ఊహించుకోలేకపోతున్నాను. 3 ఇయర్స్ నుంచి ఇలానే బాధ పడుతున్నా. ప్లీజ్ సర్ మంచి సలహా ఇవ్వండి..? – మహాలక్ష్మి
సారుకు గీర ఎక్కువ. మనం గ్రౌండ్ మీద ఉంటే సారు స్టార్లల్లో ఉన్నారు. మనది జొన్న రొట్టె అయితే... సారుది పిజ్జా స్టైల్. మనది షల్వార్ కమీజ్ అయితే... సారుది బికినీ కల్చర్. మనది ప్రేమ అయితే... సారుది టైమ్ పాస్. ‘మనది అరటిపండు అయితే... సారుది పైనాపిల్ పండు’ అని మాట కలిపింది నీలాంబరి. గౌరవం లేని చోట ప్రేమ బతకదు బంగారం. ప్రేమ లేని పెళ్లి బాధల కుండీ. ‘సార్ పాటలాగా ఉంది, నేనూ ఓ లైన్ తగిలిస్తా..’ ఓకే..! ‘లైఫ్‌లో లవ్ ఉంటే వైఫ్‌కి రెస్పెక్ట్. లేదంటే జిందగీ అన్‌హ్యాపీ బకెట్..!’
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com