నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హలో సార్! నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. తను కూడా నన్ను లవ్ చేసింది. కానీ తనని వాళ్ల మామ ఇష్టపడుతున్నాడు. అతని వయస్సు 32. ఈ అమ్మాయి వయస్సు 20. నా వయస్సు 22. వాళ్ల అమ్మతో నేను మాట్లాడాను కానీ, ఇంకా రెస్పాన్స్ ఇవ్వలేదు. వాళ్ల ఫ్యామిలీలో 60% నాకు సపోర్ట్‌గానే ఉన్నారు.
నా లవర్ వాళ్ల మామ వాళ్ల పేరెంట్స్‌కి మా ఇద్దరి లవ్ గురించి తెలుసు. తెలిసినా కూడా నా లవర్‌నే కోడలిగా కావాలంటున్నారట. పక్కవాళ్ల మాటలు విని ఇప్పుడు మా లవర్ వాళ్ల అమ్మ కూడా వాళ్ల పెళ్లికే సపోర్ట్ చేస్తుందట. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి సలహా ఇవ్వండి. – ఉదయ్
‘సార్ ఐ ప్యాడ్‌ని ఎటు తిప్పి చదివినా ఒక్క ముక్క అర్థం కాలేదు. ఐ ప్యాడ్ని స్ట్రైట్‌గా పెట్టి నేను శీర్షాసనం వేసి చదివినా ఫ్చ్... ∙సమర్ నహీ ఆయా!’ ఈ కథకి మళ్లీ ట్రాన్స్‌లేషన్ కూడానా? ‘చెప్పండి సార్ ప్లీజ్ చెప్పండి సార్!’ మామ కోడలికి ‘లైన్’ వేశాడు! మామ పేరెంట్స్‌కి కూడా అమ్మాయికి లవర్ ఉన్న విషయం తెలుసు.. అయినా అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవడానికి రెడీ! అమ్మాయి అమ్మకు మనోడు తన ‘లైన్’ గురించి ‘లీక్’ ఇచ్చాడు! అమ్మాయి అమ్మ ‘లీక్’కు ఫెవికాల్ పెట్టేసింది!
ఇప్పుడు మనోడికి గుండెలోంచి ‘లీక్’ మొదలయ్యింది! దానికి ఏమి పెట్టాలి అని అడుగుతున్నాడు! ‘ఏం పెడదాము సార్?’ మామ–కోడళ్ల పెళ్లి పుట్టబోయే పిల్లలకు మంచిది కాదు అన్న జ్ఞానం మామ పేరెంట్స్‌కి ‘లీక్’ చేస్తే.. మనోడి పెయిన్ ‘లీక్’ బంద్ అవుతుంది! ‘ఇంకా అరటి తొక్క రాసుకోమంటారేమో అని అనుకున్న... శభాష్ సర్!’
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34.