
నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హాయ్ సర్! నన్ను ఒక అబ్బాయి లవ్ చేస్తున్నాడు. నాకోసం చనిపోడానికి కూడా రెడీ అన్నాడు. నాకు భయం వేసి... నువ్వు అంటే నాకు ఇష్టమే అని చెప్పాను. కానీ, అతడితో లైఫ్ పంచుకోలేకపోతున్నాను. ఇంతలో నాకు తెలియకుండానే మరో అబ్బాయికి నా మనసు ఇచ్చేశాను. అతడికి నేనంటే ప్రాణం. చెప్పండి సర్ ఇప్పుడు నేను ఏం చెయ్యాలి. నేను ఎవరితో నా లైఫ్ షేర్ చేసుకోవాలి?
– లావణ్య
‘సార్ ఇదేమయినా ఫేస్‌బుక్ పోస్టింగా?’ వాట్ ఆర్ యూ టాకింగ్? ‘లైక్ చెయ్యడం! షేర్ చెయ్యడం...! సార్’ ఫేస్‌బుక్ స్టైల్ అంటావు! ‘అవును సార్ ఇద్దరికీ కమిట్‌మెంట్ ఇచ్చి...’ ఒకడిని బతికించుకోవాలా? ఇంకొకడి ప్రేమను బతికించుకోవాలా? అన్నది ప్రాబ్లమ్! ఒకడిని ఐ.సి.యూలో ఎడ్మిట్ చేసి... ‘ఇంకొకడి ప్రేమలో మనం పడిపోయాం...’ నువ్వు చాలా షార్ప్ నీలు..! ‘అబ్బా! ఇంకోసారి అనండి సార్.’
మాటి మాటికీ చెబితే.. పడతావు పళ్లు రాలతాయి! ‘మీ చెల్లెలు ప్రేమలో పడితే ఓకే, నేను మాయలో పడితే రాలుతాయా? ఇదేమి న్యాయం సార్!’
చెల్లెళ్లకు ఏమి తెలియదు. మనం దగ్గర ఉండము. అందుకే జాగ్రత్తగా చెప్పాలి. ‘అవును సార్ యు ఆర్ ఎ స్వీట్ బ్రదర్.’ బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించిన తరువాత ప్రేమ గీమా చూద్దాం. ముందే కన్ఫ్యూజన్‌లో ఉన్నావు. టేక్ టైమ్ లావణ్య! ‘మరి ఐ.సి.యూ కేస్ సార్..!’
సెండ్ ఒన్ డజన్.... ‘అరటి పండ్లు’ అని నవ్వింది నీలాంబరి!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com