
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్! లవ్ గురువు గారూ! డాక్టర్ దగ్గర నిజాలు చెప్పకపోతే అసలు జబ్బు బయటపడదు.
లవ్ డాక్టర్
హాయ్! లవ్ గురువు గారూ! డాక్టర్ దగ్గర నిజాలు చెప్పకపోతే అసలు జబ్బు బయటపడదు. పరిష్కారం దొరకదు. కాబట్టి మొత్తం నిజమే చెబుతున్నా. సర్ నేను ఒక అమ్మాయిని ఫోర్ ఇయర్స్‌గా లవ్ చేస్తున్నాను. తను కూడా నన్ను ఇష్టడుతోంది. ఇంతలో ఏమయిందో కానీ, గత ఆరునెలలుగా ఆమె నాతో సరిగా మాట్లాడడం లేదు. నెల రోజులుగా తను ఫోన్ కూడా యూజ్ చేయడం లేదు. నేను రాముడంత గొప్పవాడిని కాదు. నా తప్పు కూడా ఉంది. తనని బాగా తిట్టాను. తిట్టానంటే కారణం ఉండే కదా తిట్టాను? అయితే... ఆమె దూరమయ్యాక ఆ బాధేంటో తెలుస్తోంది.
వాళ్ల మమ్మీ నంబర్ తెలుసుకుని కాల్ చేశాను. ఇంకోసారి కాల్ చేస్తే సీరియస్‌గా ఉంటుందని చెప్పి స్విచ్ ఆఫ్ చేసింది. మా ఫ్రెండ్ కలిసినప్పుడు ‘నా లైఫ్‌ను నాశనం చేశాడు, నేను ఎప్పటికీ తనతో మాట్లాడను’ అని బాగా ఏడ్చిందట. ‘తనకు నువ్వంటే ఇష్టం ఉంది కానీ, కూల్ అవ్వడానికి టైమ్ పడుతుంది వెయిట్ చెయ్యి’ అంటున్నాడు మా ఫ్రెండ్. ఈ బాధను భరించలేకపోతున్నా. చచ్చిపోవాలనిపిస్తుంది. సరిగా తిండి తిని చాలా రోజులైంది. ఒకటి మాత్రం నిజం సార్... ఇకపై తనని మా అమ్మలా చూసుకుంటా. ఏదైనా సలహా చెప్పండి సార్ ప్లీజ్. – నరేష్
ప్రాణం పోయినట్లు అనిపిస్తోంది కదా? అమ్మో! మాటల్లో చెప్పలేనంత బాధ... నీ బాధ నాకు అర్థమౌతోంది. ‘ఎలా అర్థమౌతుంది సార్ తన బాధ మీకు’ ఎందుకు తెలియకూడదు? ‘ఎలా తెలుస్తుంది సార్...హౌ’ సాటి ప్రేమికుడి బాధ తెలియక పోతే ప్రిస్క్రిప్షన్ ఎలా రాస్తాను?
‘మీరొక మనసు లేని పాషాణ హృదయులు కదా!’ నీ... లాలాం... బ... బ... రి... రి... రీ...! ‘ఏంటి సార్! ట్యూన్ మిస్ అయితే అదేదో సినిమాలో సోమయాజులు ‘‘శ.. శా... ర.. ద... దా...!’’ అని కేక పెట్టినట్లు ‘‘నీ... లాలం.... బ.. బ... రి.. రి.. రీ...!’’ అని నేనేదో ట్యూన్ మిస్ అయినట్టు షౌట్ చేస్తున్నారు’ మరి నన్ను పాషాణ హృదయుడు అంటావా! అంటే హార్ట్ లేని వాడిననే కదా?
‘మగాడి బాధను అర్థం చేసుకోలేని ఏ అమ్మాయి అయినా... ఏ లవ్ డాక్టర్ అయినా.. పాషాణ హార్టే!’ అసలు నన్ను బాయ్స్ తిడుతున్నారా లేక నువ్వే ఉసిగొలిపి వాళ్లను నా మీదకు తరుముతున్నావా అన్న డౌట్ వస్తోంది. ‘మిమ్మల్ని అరటిపండ్లలో పెట్టుకుని ఆరాధించే నన్ను అనుమానిస్తారా? సార్! హతవిధీ..!’ నీకు దండం పెడతా ఇప్పుడు నేను ఏమి రాయాలో చెప్పు. అక్కడ త్రీ డేస్ నుంచి అరటిపండు తినకుండా క్యాండిటేట్ అలమటిస్తున్నాడు. ప్రేమలో పస్తులుంటున్నాడు.
‘సింపుల్ సార్, ప్రేమిస్తున్న అమ్మాయిని ప్రేమతో ట్రీట్ చెయ్యాలి. రఫ్‌గా హ్యాండిల్ చేస్తే ఎలా సార్? ఏమి నమ్మకం ఉంటుంది సార్ కంటిన్యూ అవ్వడానికి?’ అబ్ క్యా కర్నా? మనకు రాసిన ఉత్తరం... నేను ఇచ్చిన ఆన్సర్... డజన్ల అరటిపండ్లతో పాటు...’ ఆ పెంట ఫ్రెండ్‌తో పంపించమంటాను. చూశారా సార్ పాపం ఆ ఫ్రెండ్ సాయం చేస్తుంటే మీరు వాడ్ని కూడా తిడుతున్నారు. మీ వల్ల బాయ్స్ చాలా హర్టెడ్..! నేను కూడా హర్టెడ్... అరటిపండు కూడా హర్టెడ్..’
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com