
నన్నడగొద్దు ప్లీజ్
హలో, రామ్ అన్నయ్యా! రెండేళ్లుగా నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు.
లవ్ డాక్టర్ రీవిజిట్
హలో, రామ్ అన్నయ్యా! రెండేళ్లుగా నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. కానీ ఆ అమ్మాయి మా వాడివైపు కన్నెత్తికూడా చూడట్లేదు. అయితే హఠాత్తుగా నాలో ఆ అమ్మాయి పట్ల ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి. నా స్నేహితుడి ప్రేమికురాలి పట్ల నేను అలాంటి భావనతో ఉండడం తప్పే అని తెలుసు కాని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. క్లాస్‌లో ప్రతిరోజూ ఆమెనే చూస్తున్నాను. కొన్నిసార్లు ఆమె కూడా నా వైపు అలాగే చూస్తుంటుంది. ఆ చూపులను బట్టి తను నన్ను ప్రేమిస్తోందేమో అనిపిస్తోంది. కానీ నా ఫ్రెండ్‌ని చూసినప్పుడల్లా నా మెదడు హెచ్చరిస్తోందన్నయ్యా... నువ్వు తప్పు చేస్తున్నావని. అయితే మనసేమో అందుకు విరుద్ధంగా ఆమె నీ ప్రియురాలు అని చెప్తోంది. మెదడు హెచ్చరిక, మనసు మాట... ఈ రెండిటి మధ్య సతమతమవుతున్నాను. ఏదీ నిర్ణయించుకోలేకపోతున్నాను. మీరే దారి చూపాలన్నయ్యా..! – గోపి కృష్ణ
నీలాంబరీ! వాట్ ఈజ్ దిస్? ఫ్రెండ్ లవర్‌తో వాట్ ఈజ్ దిస్? ఏమైనా బుద్ధీజ్ఞానం ఉందా? వాట్ ఈజ్ దిస్? కొరకొర చూసింది నీలాంబరి. ‘సర్ ఆ గేమ్ ఆడుదామా?’ వాట్ గేమ్? మీరు గోపీకృష్ణ హార్ట్. నేను గోపీకృష్ణ మైండ్. తప్పదంటావా? ప్లీజ్ సర్.. ఓకే. ముందు నేను స్టార్ట్ చేస్తా... సర్ ప్లీజ్! ఓకే. అంతే... రైట్‌హ్యాండ్‌తో పిడికిలి బిగించి ఒక్క పంచ్ ఇచ్చింది. ఫట్‌మని పంచ్‌ని లెఫ్ట్‌హ్యాండ్‌తో ఆపుతూ ‘వాట్ ఆర్ యూ డూయింగ్?’. ‘మైండ్ కదా సర్... ఫ్రెండ్ లవర్‌ని లవ్ చేస్తే ఒక్కటి పీకమని చెప్పింది’ అంటూ లెఫ్ట్ హ్యాండ్ పిడికిలి బిగించి ఇంకో పంచ్ కొట్టింది నీలాంబరి.
రైట్ హ్యాండ్‌తో ఆపుతూ ‘మరి ఇప్పుడూ?’ అన్నాను. ఒక్క పీకుడుతో వినకపోతే... ఇంకో పీకుడు పీకమంది సర్... మై మైండ్!’ ‘నీ గేమ్ అరటి తొక్కల మీద పడి పళ్లురాల కొట్టుకోనూ..!’ నో సర్, రూల్ రూలే... గేమ్ ఫినిష్ చేయాల్సిందే!’ ‘సో ఇప్పుడు నేను గోపి హార్ట్ట్‌ని అన్నమాట. నువ్వు అన్ని పీకినా నేను నీకు ప్రేమగా అరటిపండు ఇవ్వాల్సిందే అన్నమాట. అమ్మో... నీతో గేమ్స్ ఆడకూడదు’ అంటూ నీలాంబరి పిడికిలిని ఓపెన్ చేసి అరటి పండు పెట్టా!’ అర్థమయ్యిందా గోపీ! ఫేస్ పగిలేముందు జాగ్రత్తగా ఉండు. ఫ్రెండ్‌తో నిజం చెప్పు. ఫ్రెండ్‌షిప్ గొప్పదనుకుంటే లవ్ వదులుకో. లవ్ గొప్పదనుకుంటే వేరే కాలేజ్‌కి ట్రాన్స్‌ఫర్ పెట్టుకో. గో అవే!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com