నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
గురువుగారూ! మీకు నేను పెద్ద ఫ్యాన్‌నండీ. మా క్లాస్‌లో ఒక అమ్మాయి నాతో బాగా క్లోజ్‌గా ఉంటుంది. నాతో పాటు ఇతరులతో కూడా అలానే ఉంటోంది. నాకు బాగా కోపం వస్తోంది. తను ఎప్పుడూ నాతోనే మాట్లాడాలనిపిస్తుంటుంది. తను కాలేజ్‌కి రాకపోతే.. చాలా బాధగా ఉంటుంది. తన మెసేజ్ కోసం, ఫోన్ కోసం చాలా ఎగై్జట్‌మెంట్‌తో వెయిట్ చేస్తుంటాను. ‘తను నాకంటే టు ఇయర్స్ పెద్దది. మా కులాలు కూడా వేరు. అయినా.. నాకు ఎందుకు ఇలా అవుతుందో తెలీడంలేదు. అసలు ఇది ప్రేమా, ఆకర్షణా లేక ఇన్‌ఫ్యాక్చుయేషనా... దయచేసి చెప్పండి. నేను రిలాక్స్‌డ్‌గా నిద్రపోవడానికి మంచి సలహా ఇవ్వండి గురువు గారూ. – ప్రేమ్‌కుమార్
మంచం చుట్టూ 30 రౌండ్స్ క్లాక్ వైజ్‌గా తిరగండి. రెండు కాళ్లు త్రీ ఫీట్ ఎడంగా పెట్టి లెఫ్ట్ లెగ్ బొటనవేలిని... రైట్ హ్యాండ్ చిటికెనవేలితో టచ్ చెయ్యండి. మళ్లీ రైట్ లెగ్ బొటన వేలిని... లెఫ్ట్ హ్యాండ్ చిటికెన వేలితో 30 టైమ్స్ టచ్ చెయ్యండి. కాళ్లు అలాగే ఉంచి ఫుల్‌గా ముందుకు బెండ్ అయ్యి... నుదుటిని గ్రౌండ్‌కి టచ్ చెయ్యండి. వెంటనే హెడ్‌ను వెనక్కి తిప్పి సీలింగ్ ఫ్యాన్‌ను చూడండి.
త్రీ అరటి పండ్లు తినండి. వెచ్చని పాలు ఒక గ్లాస్ తాగండి. మంచం మీద కూలబడండి. నిద్రలోకి జారుకుంటారు.
‘సార్! అన్యాయం సార్..! అబ్బాయిలు కష్టాలు చెప్పుకుంటే మీరు చీప్‌గా చూస్తున్నారు. అదే అమ్మాయి రాస్తే... తల్లీ, చెల్లీ, బంగారం... అని గారం చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. వెరీ బ్యాడ్ సర్..! పాపం సరిగ్గా చెప్పండి సార్ ప్లీజ్...!’ టెన్షన్ పడకు బ్రో నీది ప్రేమ కాదు... అమాయకంతో కూడిన... అట్రాక్షన్‌తో కూడిన... ఇన్‌ఫ్యాచ్యుయేషన్‌తో కూడిన... జెలసీ కలిసిన... భయం మాత్రమే. క్లోజ్‌గా మూవ్ అయితే వచ్చే ప్రాబ్లమ్... అంతే! డిస్టెన్స్ మెయిన్‌టెన్ చేస్తే ప్రేమలో కాలు వేసి పడే అవసరమే ఉండదు. ఆల్ ది బెస్ట్.
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com