
నన్నడగొద్దు ప్లీజ్
సర్! నేను గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అవుతున్నా. త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక అబ్బాయిని లవ్ చేశాను.
లవ్ డాక్టర్ రీవిజిట్
సర్! నేను గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అవుతున్నా. త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక అబ్బాయిని లవ్ చేశాను. తనకి కూడా నేనంటే ఇష్టం. కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల తనతో ఇష్టం లేదని చెప్పాను. నాకు నా కెరీర్ ఇంపార్టెంట్ అనిపించింది. మోరోవర్ మా మదర్‌ని బాగా చూసుకోవాలి. ఇట్స్ మై రెస్పాన్స్‌బిలిటి. ఇవన్నీ ఆలోచించి తనని వద్దన్నాను. కానీ... ఆ అబ్బాయి అంటే చెప్పలేనంత ఇష్టం. ఈ విషయం నాకు జాబ్ వచ్చాక చెబుదామనుకుంటున్నా. తను ఓ ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. తనకి చెప్పలా వద్దా? ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ప్లీజ్ సర్! గివ్ మి ఎ సొల్యూషన్... – శ్రావణి
‘కమాన్ నీలాంబరీ... ఇది నువ్వు చెబితేనే బాగుంటుంది’. ‘మీరు నా మీద అంతగా డిపెండ్ అయితే బీ కేర్ ఫుల్. మీకు ఉత్తరాలు రాయడం మానేస్తారు. అప్పుడు మీరు చాలా ఫీల్ అయిపోయి అరటిపండ్లు అమ్ముకుంటూ రోడ్ల మీద తిరుగుతుంటే నేను చూడలేను. ఐ కాంట్ సీ యూ లైక్ దట్ సర్’ ‘అయితే ఒక పనిచేద్దాం. నువ్వు శ్రావణిలా మాట్లాడు, నేను ఆ అబ్బాయిలా మాట్లాడతాను. కమాన్ స్టార్ట్... ఆన్సర్ మనమే ఇద్దాం’
శ్రావణి: హాయ్! ఎలా ఉన్నావ్?
అబ్బాయి: ఎలా ఉంటాను... బాగా మిస్ చేస్తున్నాను. నీ జాబ్ ఏమైంది?
శ్రావణి: ట్రై చేస్తున్నాను. తప్పకుండా వస్తుందిలే!
అబ్బాయి: అమ్మగారు ఎలా ఉన్నారు?
శ్రావణి: నేను బాధ పడుతుంటే చూడలేకపోతున్నారు. డోన్ట్ వర్రీ అని చెబుతున్నారు.
అబ్బాయి: ఐ లవ్ యూ వెరీ మచ్ రా... అంతా మంచే జరుగుతుంది.
శ్రావణి: థాంక్ గాడ్!
‘అబ్బ... ఎంత సింపుల్‌గా సాల్వ్ అయిపోయింది సర్, అప్పుడప్పుడు అరటిపండ్లు తినడం తగ్గించి ఇలాంటి ఫెంటాస్టిక్ బాయ్, గర్ల్ డైలాగ్ గేమ్ ఆడదాం’ అంది నీలాంబరి.
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com