13 క్రస్టుగేట్ల ద్వారా శ్రీశైలానికి పరుగులు పెడుతున్న కష్ణమ్మ
జూరాలకు జలకళ
Published Fri, Aug 5 2016 1:17 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM
– ప్రాజెక్టులో 13 క్రస్టుగేట్ల ఎత్తివేత
– 1,38,401 క్యూసెక్కులు దిగువకు విడుదల
– శ్రీశైలానికి కష్ణమ్మ పరుగులు
జూరాల : మహారాష్ట్రలోని కష్ణానది పరివాహక ప్రాంతంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు భారీ స్థాయిలో ఇన్‌ఫ్లో వరద చేరుతుంది. దీంతో గురువారం జూరాల ప్రాజెక్టులో 13 క్రస్టుగేట్లను ఎత్తారు. 89,986 క్యూసెక్కులను విద్యుదుత్పత్తి ద్వారా 45వేల క్యూసెక్కులతో 1,38,401 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి విడుదలవుతున్న వరద ప్రవాహం లోయర్ జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా శ్రీశైలం రిజర్వాయర్‌కు వెళ్తోంది. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 9.65 టీంఎసీలు కాగా ప్రస్తుతం రిజర్వాయర్‌లో నీటినిల్వ 8.35 టీఎంసీలుగా ఉంది. ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోను దష్టిలో ఉంచుకొని భారీ స్థాయిలో వరద నీటిని వదులుతున్నారు. జూరాల రిజర్వాయర్‌కు 1,25,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది.
పుష్కరఘాట్లకు భారీ వరద
కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 2.32 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటంతో శుక్రవారం జూరాల ప్రాజెక్టు పై ప్రాంతంలో ఉన్న పుష్కరఘాట్లతో పాటు జూరాల నుంచి శ్రీరంగాపురం వరకు ఉన్న పుష్కరఘాట్లకు వరద ప్రవాహం తాకనుంది. 2.50 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటంతో నది ఒడ్డున ఉన్న ఘాట్ల వద్ద వరద నీటిమట్టం భారీగా పెరిగి పనులకు ఆటంకం కలగనుంది. కష్ణానది జిల్లాలోకి ప్రవేశించే కష్ణా ప్రాంతంవద్ద నుంచి బీచుపల్లి వరకు నదికి రెండువైపులా ఉన్న ఘాట్లకు వరద ప్రవాహం చేరనుంది. శ్రీశైలం ప్రాజెక్టు రిజర్వాయర్‌కు వరద మరింతగా పెరిగితే రిజర్వాయర్ నీటిమట్టం పెరిగి కొల్లాపూర్, అలంపూర్, అచ్చంపేట నియోజకవర్గాల్లోని పుష్కరఘాట్ల వరకు నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటినిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 43 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మరో మూడు రోజుల పాటు ఎగువనుంచి వరద ఇన్‌ఫ్లో కొనసాగితే రిజర్వాయర్‌లో నీటినిల్వ 80 నుంచి 100 టీఎంసీలకు పెరిగే అవకాశం ఉంది. రిజర్వాయర్‌లో నీటిమట్టం పెరిగితే వీఐపీ ఘాట్‌గా నిర్మాణమైన గొందిమల్ల ఘాట్ వరకు నీటిమట్టం పెరిగి పుష్కర స్నానాలు ఆచరించేందుకు అవకాశం ఏర్పడుతుంది.
Advertisement
Advertisement