
నన్నడగొద్దు ప్లీజ్
సర్.. నేను మీకు ఇష్టమైన అరటిపండ్ల వ్యాపారం చేస్తుంటాను.
లవ్ డాక్టర్ రీవిజిట్
సర్.. నేను మీకు ఇష్టమైన అరటిపండ్ల వ్యాపారం చేస్తుంటాను. రోజూ మీ లవ్ డాక్టర్ చదివే మీ అభిమానిని. మా షాప్ దగ్గర ఒక అమ్మాయి నన్ను లవ్ చేస్తోంది. ఆ అమ్మాయిది ప్రేమా? ఆకర్షణా? నాకు తెలీదు. నాతో మాట్లాడ్డానికి చాలాసార్లు ట్రై చేసింది. షాప్ దగ్గర మాట్లాడొద్దని చెప్పాను. బయట ఎక్కడైనా మాట్లాడదాం అంటే మాట్లాడటం లేదు. ఏం చేయాలి? – బాషా
షాప్ దగ్గర మాట్లాడితే పండ్లు కుళ్లిపోతాయా..? అందరూ చూస్తే నీ గౌరవం భ్రష్టు పట్టిపోతుందా..? ప్రేమిస్తున్న అమ్మాయితో అరటిపండు సాక్షిగా మాట్లాడలేని బాషా.. బాషా.. బాషా... జబ్ ప్యార్ కియాతో డర్నా క్యా... అంత భయం ఏంటి..? ప్రేమను అంత సీక్రెట్‌గా హ్యాండిల్ చేయ్యాలంటే.. ఒక పని చెయ్యి మై డియర్ బ్రో.
అమ్మాయి ఈసారి షాప్‌కి వచ్చినప్పుడు ఒక అరటిపండు బండి తీసుకుని గట్టిగట్టిగా.. ఏయ్... పండు.. పండు.. పండు.. అ.. ర...టి పండు.. అంటూ హ్యాపీగా బిజెనెస్ చేసుకో భాయ్. అమ్మాయి వెనుకాలే ఫాలో అయిపోతుంది... నువ్వు అనుకున్న బయట ఎక్కడైనా ఆమె అనుకున్న అరటిపండు సాక్షిగా లవ్ ఎక్స్‌ప్రెస్ చేసుకోవచ్చు. ఇవాళ నీలాంబరి ఇంకా రాలేదు. ఆ తోపుడు బండి ఏదో నా క్లినిక్ దాకా తెస్తే మిమ్మల్నీ చూడొచ్చు, అరటిపండు తినొచ్చు. క్యా బోల్తే...?
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్