
నన్నడగొద్దు ప్లీజ్
హాయ్ సర్, నా వయస్సు ఇరవై మూడు.
లవ్ డాక్టర్
హాయ్ సర్, నా వయస్సు ఇరవై మూడు. నేను ఒకరిని ప్రేమించాను. అతని పేరు రెహ్మాన్. ఒన్ అండ్ ఆఫ్ ఇయర్ వరకు బాగానే ఉన్నాం. టు ఇయర్స్ తరువాత మ్యారేజ్ అనుకున్నాం. కానీ ఇప్పుడు తన ఫ్యామిలీకి బయపడో.. లేక ఏం ప్రాబ్లమ్‌లో ఉన్నాడో తెలీదు కానీ, నన్ను మరిచిపో అంటున్నాడు. మీ పెద్దల చూసిన సంబంధం చేసుకో అంటున్నాడు. నాకు పిచ్చి పడుతుంది. ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు. సలహా చెప్పండి. – నజ్మా
పిచ్చెక్కదా మరి..? పిచ్చోడ్ని ప్రేమిస్తే పిచ్చెక్కదా..? ‘ఏం పిచ్చి సార్..?’ అమ్మాయిలను యూజ్ అండ్ త్రో పిచ్చి. ‘అది పిచ్చెలా అవుతుంది మోసం అవుతుంది కదా..?’ అబ్బ.. నువ్వు ఎంత స్మార్ట్..? ‘వద్దులే సార్.. ఎంత పొగిడినా మీ ట్రేప్‌లో పడను. ఆన్సర్ సరిగ్గా ఇస్తేనే అరటిపండు.’ నా వీక్‌నెస్ మీద కొట్టావు.
‘సింపతీ కోసం ట్రై చెయ్యకండి సార్..’ నీలాంబరీ నీకున్న క్లారిటీ నజ్మాకి ఉంటే.. ఆ పిచ్చోడి చేతిలో తన లవ్ ఒక రాయి అయ్యేది కాదు కదా..? ‘అంటే ఇప్పుడు నజ్మా ఏం చెయ్యాలి..?’ అర.. ‘సార్ అరటిపండు తినమనటం, తొక్క పారేయమనటం చెప్పకండి సార్.. మేటర్ సీరియస్..’వాడొక డుద్రురిద డు.. గా.. వ..ద..వె. వాష్ బేషిన్‌లో గట్టిగా ఖాండ్రించి ఊసేయాలి వాడి జ్ఞాపకాన్ని. బలం పుంజుకోవాలి. మోసగించిడం పాపమయితే, మోసపోవడం మహా పాపం తల్లీ.! నీ ఇంటెలిజెన్సీని నువ్వు అవమానించినట్టు..! గెట్ రిడ్ ఆఫ్ హిం బంగారం.
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com