నన్నడగొద్దు ప్లీజ్‌ | Love Doctor Returns | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Published Thu, Mar 16 2017 11:15 PM | Last Updated on Tue, Sep 5 2017 6:16 AM

నన్నడగొద్దు ప్లీజ్‌

నన్నడగొద్దు ప్లీజ్‌

లవ్‌ డాక్టర్‌ రీవిజిట్‌

నా వయసు 24. మావాళ్లు ఒక అమ్మాయిని చూపించి వాళ్ల పెద్దవాళ్లతో మాట్లాడామన్నారు. నేను ఈలోగా ఆ అమ్మాయితో మాట్లాడాను. తను ‘నువ్వంటే ఇష్టమే కానీ మావాళ్లు ఎవరిని చూపిస్తే వాళ్లనే పెళ్లి చేసుకుంటా’ అని అంటోంది. వాళ్ల పెద్దవాళ్లు ఇంకా ఏ విషయం చెప్పడం లేదు. దాంతో మావాళ్లు వాళ్లపై కోపంతో నాకు వేరే సంబంధాలు చూస్తున్నారు. ఆ అమ్మాయి ఉద్దేశం ఏమిటో అర్థం కావడం లేదు? (పేరు పెట్టవద్దని విజ్ఞప్తి)

సార్‌... మనకు నచ్చినంత తొందరగా వాళ్లకు నచ్చాలని ఏమీ లేదు. మనమేమైనా మహేష్‌ బాబు లుక్‌ ఎ లైకా..? కొంచెం టైమ్‌ పడుతుంది. వాళ్ల దగ్గర ఉన్న అన్ని హీరోల కాల్‌ షీట్లు చెక్‌ చేసుకుని, వాళ్లెవరూ అవైలబుల్‌గా లేకపోతే.. మన కాల్‌షీట్‌ అడగొచ్చు. లైఫ్‌ అమ్మా.. అట్లాగే ఉంటుంది. ఏదైనా అతిగా కావాలని అనుకుంటే ఏదో ఒకటి అడ్డం పడాల్సిందే. సమజైందా బిడ్డా? మనకంటే తురుమ్‌ ఖాన్లు ఎంతో మంది ఉంటారన్న ఇంగిత జ్ఞానం... అదేరా భాయ్‌ కామన్‌సెన్స్‌ చాలా అవసరం.

నీలాంబరి అరటి పండు ఇవ్వాలా? వద్దా? అని ఆలోచిస్తోంది. అడగకుండా ఇస్తే నేను రెస్పెక్ట్‌ చేయనేమోనని గేమ్‌ ఆడుతోంది. అడిగి తీసుకుంటే ఇంకా ఆట పట్టిస్తుందని నేను వెయిటింగ్‌. అందుకే ఇద్దరం ఈ గేమ్‌లో తొందరపడదల్చుకోలేదు. నాలో నేను నవ్వుకుంటున్నాను. తనలో తాను కుళ్లుకుంటోంది. బహుత్‌ మజా ఆ రహా హై.

 కానీ నువ్వు ఆ పిల్లను నిజంగానే ఇష్టపడుతుంటే వాళ్ల ఇంటికి నీ ఇగోని తొక్కుకుంటూ ముందడుగు వెయ్యాలి... ఎందుకంటే దేర్‌ కాంట్‌ బి ఏన్‌ ఇగో ఇన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ లవ్‌... ప్రేమ ముందు ఇగో ఎందుకు బ్రో? గో అండ్‌ ఆస్క్‌ హర్‌ పేరెంట్స్‌. పోయి చెప్పు నీకు అమ్మాయంటే ఇష్టమని ఇప్పుడు నేను కూడా అలాంటిదే ఏదో చేయబోతున్నాను. రియాక్షన్‌ ఎట్లా ఉంటుందో చూసి ఎంజాయ్‌ చెయ్యి.
‘నీలాంబరి, నువ్వు ఇవ్వకపోతే ఆ అరటి పండులో అంత స్వీట్‌నెస్‌ ఉండదు. ఐ థింక్‌ ఇట్స్‌ యువర్‌ హ్యాండ్స్‌. నీ చేతులతో ఇస్తే పచ్చి అరటి పండు కూడా పండు అయిపోతుంది’ అన్నాను.అంతే! జంప్‌ కొట్టి నా టేబుల్‌ మీద కూర్చుని అరటి పండు వలిచి మరీ... చేతిలో పెట్టింది. సమజైందా బిడ్డా. ఇష్టం ఉన్నప్పుడు వాళ్లు కొంచెం బెట్టు చేసినా మనం గారాబం చేయాలి. దట్స్‌ ట్రూ లవ్‌.

- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌
ఈ కింది అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34.
lovedoctorram@sakshi.com

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement