నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హాయ్ అన్నయ్యా! నేను ఒకతన్ని ప్రాణంగా ప్రేమించా. తనకు కూడా నేనంటే చాలా ఇష్టం. నన్ను ఎప్పుడూ దూరం పెట్టలేదు. నాకు ఏ కష్టం వచ్చినా తను తోడుగా ఉండేవాడు. కానీ... ఈ మధ్య తను... కొంచెం తేడాగా కనిపిస్తున్నాడు. ఫోన్‌లో నాతో ఎలా ప్రేమగా మాట్లాడుతాడో... అలానే మరో అమ్మాయితో కూడా మాట్లాడుతున్నాడు. చాట్ చేస్తున్నాడు. ‘ఐ లవ్ యూ’ అని కూడా చెబుతున్నాడు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నేను తనకి ఏం తక్కువ చేశానో అర్థం కావడం లేదు. అబ్బాయిలు ఇలా ఎందుకు ఉంటారు? ఏడుపొస్తోంది అన్నయ్యా! ఈ విషయం తనని అడగాలా వద్దా? అడిగితే నాతో మాట్లాడడేమో అని భయంగా ఉంది అన్నయ్యా! ప్లీజ్ సలహా ఇవ్వండి.
– రమ్య
టెన్షన్ పడకు తల్లీ! లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. నథింగ్ టు వర్రీ. ఆ డర్టీ ఫెలో అంటేనే యాక్ అనిపిస్తోంది. బ్లడీ రాస్కెల్ గురించి వింటేనే ‘బువాక్’ అని వాంతి వస్తోంది. ఇంకా వాడి తోక పట్టుకుని తిరుగుతానంటావేంటి తల్లీ! సెకెండ్ అమ్మాయికి ఫోన్ చేసి... వీడు ఫస్ట్ హ్యాండ్ రోగ్ అని చెప్పెయ్. వీలయితే ఇద్దరూ కలిసి స్ట్రెయిట్‌గా వాయించేయండి. డోంట్ బి వీక్ చెల్లెమ్మా.. ఏసెయ్ కొడుకుని! ‘సార్ ఇవాళ్ల మీ యాక్కు... దొక్కు... బువాక్ మూడ్‌లో అరటిపండు దిగదు’ అని విలన్‌లా నవ్వింది నీలాంబరి.
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com