నన్నడగొద్దు ప్లీజ్
లవ్ డాక్టర్
హలో సర్! అమ్మాయిలు... ఫ్రెండ్స్‌ని దూరంగా పెట్టి వన్ ఇయర్‌గా ఈ హైదరాబాద్‌లో బానే చదువుకుంటున్నా. అయితే సడన్‌గా ఓ అమ్మాయి నా లైఫ్‌లోకి వచ్చింది. తను మా సిస్టర్‌కి సీనియర్. ఫోన్‌లో మాట్లాడుకునే వాళ్లం. నీపై ఇంట్రెస్ట్ ఉండటం వల్లే మాట్లాడుతున్నా, ఇప్పటి దాకా ఎవరితోనూ ఇలా మాట్లాడలేదు అనేది. దాంతో నాకు దోమ కుట్టింది. తన గురించి తెలుసుకునే క్రమంలో తన కాల్ లిస్ట్ తీయిస్తే దిమ్మతిరిగి బొమ్మ కనిపించింది. దాన్ని చూపించి... ‘ఏంటిది’ అని నిలదీస్తే... ‘నాకు లవర్ ఉన్నాడు నన్ను వదిలెయ్యి’ అని చెప్పింది. అసహ్యంతో మరిచిపోదాం... అంటే మరిచిపోలేకపోతున్నా. దయచేసి మంచి సలహా ఇవ్వండి. లేదంటే.. నేను ఏ అరటి చెట్టుకో ఉరి వేసుకోవాలి! – నరేష్
ఎందుకు లే అన్నా... నన్ను భయపెడతావు చెట్టు... ఉరి అని. పాపం అరటిచెట్టు ఏం పాపం చేసింది. దాన్నెందుకు నేల కూలుస్తావు!దోమ కుట్టిందంటే జ్వరం రాక మానదు. కుట్టిన తరువాత మందు వేసుకోవాలి కానీ.. ఇప్పుడు దోమతెరలో దూరితే ఏం దొరుకుద్ది?‘సార్... ఈ దోమతెర ఏంటి సార్?’b ప్రేమ విఫలమైతే దూరి ఏడవడానికి దోమతెర గుడ్ ప్లేస్! ‘అందరికీ కనబడుద్ది కదా సార్... ఏం లాభం?’ కాల్ లిస్ట్‌లో ఉన్న ఫోన్ కాల్స్ వల్ల గుండెకు పడ్డ చిల్లుల కంటే ఎక్కువ చిల్లులేమీ ఉండవులే దోమతెరలో..! ‘అబ్ క్యా కర్నా..?’లక్కీగా ప్రేమా దోమా వద్దనుకునే ఒరిజినల్ మనిషివి అవడానికి మంచి ఛాన్స్ వచ్చింది. పుటుక్కున పట్టేసుకుని, తపుక్కున ప్రేమ మీద నుంచి జంప్ కొట్టి కొత్త లైఫ్‌కి దోమతెర ఓపెన్ చేసుకో!
‘గబుక్కున నేను డజను అరటిపండ్లు పంపుతా సార్ మంచిగా చదువుకుని లవ్ డాక్టర్ అయిపోమని మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి’ అని నవ్వింది నీలాంబరి.బ్రో అసలు టెన్షన్ పడకు. బీ బ్రేవ్. నాకు నీ మీద నమ్మకం ఉంది. ఫ్యామిలీతో ఫ్రెండ్స్‌తో ప్రాబ్లమ్ షేర్ చేసుకో. లైఫ్‌లో ప్రాబ్లమ్ వస్తేనే మనం స్ట్రాంగ్ అవుతాం. ‘అరటిపండు తింటే కూడా స్ట్రాంగ్ అవుతాం... నరేష్.. బీ హ్యాపీ’ అంది నీలాంబరి.
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com